News July 3, 2024

ఏడుపాయల దేవాలయ ఈవోగా కృష్ణ ప్రసాద్

image

ఏడుపాయల వన దుర్గామాత ఆలయ నూతన ఇఓగా కృష్ణ ప్రసాద్ నియామకమయ్యారు. ఈ మేరకు ఆయన బుధవారం ఏడుపాయల దేవాదాయ శాఖ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఇంచార్జీ ఈవోగా పని చేసిన వినోద్ రెడ్డిని వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయ ఏసీగా నియమించడంతో ఆయన స్థానంలో కృష్ణ ప్రసాద్‌ను నియమిస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నత అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం కలెక్టర్ రాహుల్ రాజ్‌ను కలిశారు.

Similar News

News November 17, 2025

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిని పరిశీలించిన కలెక్టర్

image

టేక్మాల్ మండలంలో వివిధ గ్రామాల్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి పనులను కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. పెండింగ్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ అంశం మీద సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముందుగా అన్ని గ్రామాల వారీగా ఇంకా నిర్మాణాలు ప్రారంభించకుండా ఉన్న వాటి వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.

MDK: నిరుపేదలకు అండగా మంత్రి దామోదర్

image

మెదక్ జిల్లాలోని బొడ్మట్ పల్లి గ్రామానికి చెందిన ఎండీ.ఇర్ఫాన్ గత కొన్నిరోజులుగా కిడ్నీల సంబందిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వైద్య ఆరోగ్య మంత్రి దామోదర్ తక్షణమే స్పందించి ఉస్మానియా హాస్పిటల్ సంబంధిత వైద్యులతో తానే మాట్లాడి, మెరుగైన వైద్యం కోసం స్వయంగా అంబులెన్స్ పంపి ఉస్మానియా హాస్పటల్‌కి పంపించారు. ఇర్ఫాన్ ఆరోగ్యం తన బాధ్యత అని వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.