News April 25, 2024
ఏడు గంటల ఆలస్యంగా నడుస్తున్న బెనారస్ రైలు
రేపు తెల్లవారుజామున 4.20 గంటలకు బయలుదేరాల్సిన విశాఖపట్నం – బనారస్ ఎక్స్ప్రెస్ రైలు ఆలస్యంగా నడుస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. లింక్ రైలు రాక ఆలస్యం వలన 7 గంటలు ఆలస్యంగా 11.20 గంటలకు విశాఖలో బయలుదేరుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు దీని గమనించి ప్రధానంగా తమ ప్రయాణ సమయాన్ని మార్చుకోవాలని సూచించారు.
Similar News
News January 19, 2025
విశాఖ: రూ.1,586.08కోట్ల బడ్జెట్‌కు ఆమోదం
వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025-26) రూ.1,586.08 కోట్లతో రూపొందించిన బడ్జెట్‌కు విశాఖ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఆమోదించింది. ఈ సమావేశం శనివారం జడ్పీ ఛైర్‌పర్సన్ సుభద్ర అధ్యక్షతన జరిగింది. బడ్జెట్‌లో ఆదాయం రూ.1589.13, వ్యయం రూ.1586.08 కోట్లుగా చూపించారు. త్వరలో దీనిని ప్రభుత్వ ఆమోదానికి పంపుతామని జడ్పీ సీఈవో నారాయణమూర్తి తెలిపారు.
News January 19, 2025
మాకవరపాలెం: ఆర్మీ జవాన్ ఆత్మహత్య
మాకవరపాలెం మండలం బూరుగుపాలెంకు చెందిన ఆర్మీ జవాన్ గూనూరు భరత్(22) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏడాది క్రితం అగ్నివీర్ ఎంపికలో ఉద్యోగం పొందిన భరత్ శిక్షణ ముగించుకుని వెస్ట్ బెంగాల్‌లో ఉద్యోగం చేసేవాడు. అయితే కాకినాడ జిల్లా పిఠాపురంలో ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రేమించిన యువతి దూరమవుతుందని మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మృతదేహాన్ని శనివారం రాత్రి స్వగ్రామం తీసుకువచ్చారు.
News January 19, 2025
భీమిలి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్తగా మజ్జి శ్రీనివాస్ రావు
వైసీపీ అధినేత జగన్ మొహన్ రెడ్డి ఆదేశాల మేరకు పలు పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలను, పరిశీలకులను మారుస్తూ శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. ఇందులో భాగంగా భీమిలి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్తగా మజ్జి శ్రీనివాస్ రావు (చిన్న శ్రీను)ని నియమించారు. మజ్జి శ్రీనివాస్ రావు (చిన్న శ్రీను) ప్రస్తుతం విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఉన్నారు.