News July 20, 2024

ఏడు నెలల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేశాం: మంత్రి జూపల్లి

image

వరంగల్ రైతు డిక్లరేషన్‌లో రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం రేవంత్ రెడ్డి సకాలంలో రూ.2లక్షల లోపు రైతు రుణమాఫీ చేశారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం కామారెడ్డిలో మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేశామని పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రజలే కేంద్రబిందువుగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు.

Similar News

News October 2, 2024

‘పాలమూరు సీతాఫలాలకు జాతీయస్థాయిలో మంచి గుర్తింపు’

image

ఉమ్మడి పాలమూరు సీతాఫలాలకు వివిధ రాష్ట్రాలలో మంచి డిమాండ్ ఉంది. కొల్లాపూర్ మామిడితో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన పాలమూరులో పండే సీతాఫలాలకు సైతం అదే స్థాయిలో గుర్తింపు వస్తోంది. ఈ ప్రాంతంలో ఉన్న అడవులు, వాతావరణం, వర్షపాతం తదితర కారణాలవల్ల సీతాఫలాలు మధురంగా ఉండడమే కాదు.. ఆరోగ్యాన్ని ఇవ్వడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయని ప్రచారం జరుగుతుండడంతో జాతీయస్థాయిలో పాలమూరు సీతాఫలాలకు మంచి గుర్తింపు లభిస్తుంది.

News October 2, 2024

జూరాలలో 11 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి

image

జూరాల ఎగువ, దిగువ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో మంగళవారం 11 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తిని చేపడుతున్నామని అధికారులు తెలిపారు. ఎగువలో 5 యూనిట్ల ద్వారా 195 మెగావాట్లు, దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు విద్యుదుత్పత్తిని కొనసాగుతుందన్నారు. ఇప్పటి వరకు 408.108 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని సాధించామని తెలిపారు.

News October 2, 2024

ఉమ్మడి MBNR జిల్లా ప్రత్యేక అధికారిగా రవి

image

తెలంగాణలోని10 ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా(MBNR, NRPT, WNP, NGKL, GDWL) ప్రత్యేక అధికారిగా కాలుష్య నివారణ బోర్డు సెక్రటరీ రవి ఐఏఎస్‌ను నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు ఆయా జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకొని ముందుకెళ్లాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఆదేశించారు.