News June 4, 2024

ఏదైనా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం: పొంగులేటి

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో చరిత్ర సృష్టించాలన్నా దాన్ని తిరగరాయాలన్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడతూ.. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి విజయం సాధించడంతో హర్షం వ్యక్తం చేశారు. రఘురాంరెడ్డి గెలుపునకు కృషి చేసిన కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Similar News

News November 13, 2024

బోనకల్: కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

image

ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలోని ఆళ్లపాడు గ్రామంలో మంగళవారం రాత్రి బీఆర్ఎస్, ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని విక్రమార్క సమక్షంలో వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ప్రజా పాలనతో మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, వంట గ్యాస్ రూ.500కి అందించడమే కాక, అభివృద్ధి పథంలో మధిర నియోజకవర్గం నిలుస్తోందని నందిని విక్రమార్క తెలిపారు.

News November 13, 2024

వ్యవసాయశాఖ అధికారులతో మంత్రి తుమ్మల సమావేశం

image

వ్యవసాయ అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునరుద్ధరించడానికి కావాల్సిన నిధులు, పథక అమలు తీరుతెన్నులపై చర్చించారు. వ్యవసాయ కార్యదర్శి రఘునందన రావు, డైరెక్టర్ గోపి, సహకార సంస్థల ప్రతినిధులలు పాల్గొన్నారు. ఈ యాసంగి నుంచి రైతులకు అవసరమైన పనిముట్లను, యంత్రాలను, సబ్సిడీపై సరఫరా చేయడానికి ప్రణాళిక సిద్దం చేసామని వ్యవసాయశాఖ డైరెక్టర్ శ్రీ గోపి తెలిపారు.

News November 13, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

> మధిర మండలం జీలుగుమాడులో విద్యుత్ సరఫరాకు అంతరాయం > వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ రైతులతో ప్రత్యేక సమావేశం > భద్రాచలంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ వెంకటయ్య పర్యటన > వైరాలో కొనసాగుతున్న పది జిల్లాల స్థాయి క్రీడా పోటీలు > మెస్ ఛార్జీలు పెంచాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఎంఈఓ కార్యాలయం ఎదుట ఆందోళన> కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే > భద్రాచలం రామాలయంలో ప్రత్యేక పూజలు