News February 8, 2025

ఏదైనా సమస్య ఉంటే సహచరులతో షేర్ చేసుకోండి: వరంగల్ క్రైం ఏసీపీ

image

వ్యక్తిగతంగాని లేదా శాఖపరమైన ఏదైనా సమస్య ఉంటే సహోద్యోగులతో షేర్ చేసుకుంటే సమస్య పరిష్కారానికి మార్గం దొరుకుతుందని వరంగల్ క్రైం ఏసీపీ భోజరాజు అధికారులు, సిబ్బందికి సూచించారు. ఇటీవల పోలీస్ అధికారులు, సిబ్బంది రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో క్రైం ఏసీపీ పోలీస్ అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు. ఒత్తిళ్లకు కంగారు పడకుండా తగిన పరిష్కార మార్గాల కోసం అన్వేషించాలని క్రైం ఏసీపీ తెలిపారు.

Similar News

News December 16, 2025

జంగారెడ్డిగూడెం: లైంగిక దాడి కేసులో నిందితుడి అరెస్టు

image

జంగారెడ్డిగూడెం మండలం నాగులగూడెం గ్రామానికి చెందిన 10 సంవత్సరాల బాలికపై ఆమె మారుతండ్రి లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో పోలీసులు మంగళవారం నిందితుడిని అరెస్ట్ చేశారు. ముద్దాయిపై రౌడీ షీట్ కూడా తెరుస్తున్నామని పోలీసులు తెలిపారు. రాబోయే రోజుల్లో ఎవరైనా ఇటువంటి అమానవీయ చర్యలకు పాల్పడితే వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు.

News December 16, 2025

క్రీడల అభివృద్ధికి కృషి చేస్తాం: ఏపీఐఐసీ డైరెక్టర్

image

రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని APIIC డైరెక్టర్ దోమా జగదీశ్ గుప్తా అన్నారు. మంగళవారం కర్నూలులోని సిల్వర్ జూబ్లీ కళాశాల మైదానంలో కర్నూలు జిల్లా నెట్ బాల్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా నెట్ బాల్ సీనియర్ క్రీడాకారుల ఎంపిక పోటీలను జిల్లా అధ్యక్షుడు నాగేశ్వర బాబుతో కలిసి ప్రారంభించారు. నగరాన్ని స్పోర్ట్స్ సిటీగా తీర్చేందుకు మంత్రి కృషి చేస్తున్నారన్నారు.

News December 16, 2025

నువ్వుల పంటలో కలుపు నివారణ, అంతరకృషి

image

నువ్వుల పంట విత్తిన 24-48 గంటల్లోపు ఎకరానికి 200 లీటర్ల నీటిలో పెండిమిథాలిన్ 30%ఇ.సి. 700mlను కలిపి పిచికారీ చేస్తే 20 రోజుల వరకు కలుపును నివారించవచ్చు. పిచికారీ సమయంలో నేలలో తగినంత తేమ ఉండాలి. విత్తిన తర్వాత వర్షం పడే సూచనలు ఉంటే పెండిమిథాలిన్ పిచికారీ చేయకూడదు. అలాగే దీని పిచికారీ తర్వాత నీటి తడి పెట్టకూడదు. విత్తిన 15-20 రోజుల లోపు అదనపు మొక్కలను, 25-30 రోజుల తర్వాత మనుషులతో కలుపు తీయించాలి.