News July 20, 2024

ఏపీఐఐసీ భూములపై సమగ్ర నివేదికను సిద్ధం చేయాలి: కలెక్టర్

image

ఏపీఐఐసీకి కేటాయించిన భూములపై సమగ్ర నివేదిక ఇవ్వాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని కప్పల బండ, హిందూపురం, మడకశిర, లేపాక్షి ప్రాంతాలలో ఎలాంటి పనులు చేపట్టాలో అధికారులు కార్యచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. గొల్లపల్లి రిజర్వాయర్ అభివృద్ధి కోసం కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

Similar News

News November 18, 2025

అర్జీలు త్వరగా పరిష్కరిస్తాం: అనంత కలెక్టర్

image

అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ సమస్యలపై అర్జీదారుల నుంచి జిల్లా కలెక్టర్ ఆనంద్ అర్జీలను స్వీకరించారు. స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులతో విచారణ జరిపి త్వరలోనే పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు. సమస్యల పరిష్కారంపై నిరంతర సమీక్ష ఉంటుందన్నారు.

News November 17, 2025

అనంతపురం: పోలీసుల PGRSకు 83 పిటిషన్లు.!

image

అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం అర్బన్ DSP శ్రీనివాసరావు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లా SP ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి 83 పిటీషన్లు వచ్చాయి. పిటిషనర్లతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.