News April 6, 2024
ఏపీకి కేంద్రం తీరని అన్యాయం చేసింది: ఎంపీ భరత్
రాజమండ్రిలో అభివృద్ధి జరగలేదని, మరోవైపు కేంద్ర నిధులతోనే ఇక్కడ అభివృద్ధి జరిగిందని ఏపీ బీజేపీ చీఫ్, రాజమండ్రి లోక్‌సభ అభ్యర్థి పురంధీశ్వరి అనడం విడ్డూరంగా ఉందని ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి కేంద్ర ప్రభుత్వం నిధుల మంజూరు విషయంలో, రాష్ట్ర విభజన హామీల అమలు విషయంలో తీరని అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు.
Similar News
News January 19, 2025
కూనవరం: ఆదివాసీల సామూహిక చేపల వేట
కూనవరం మండలం చిన్నారుకుర్ పెద్ద చెరువులో ఆదివారం ఆదివాసీలు సామూహిక చేపల వేట నిర్వహించారు. సంక్రాంతి తర్వాత సంప్రదాయంగా చేపల వేట చేస్తామన్నారు. నాలుగు మండలాల నుంచి 3000 మంది చిన్నా ,పెద్దా తేడా లేకుండా ఆదివాసీ పెద్దల సమక్షంలో చేపల వేట సాగించారు. గ్రామ పెద్దలు బంధువులు అందరికీ కబురు పెట్టి వారి సమక్షంలో వయసుతో నిమిత్తం లేకుండా ఈ వేట సాగిస్తారన్నారు.
News January 19, 2025
పిఠాపురంలో ఆర్మీ జవాన్ ఆత్మహత్య
పిఠాపురంలో అనకాపల్లి జిల్లా మాకవరపాలేనికి చెందిన ఆర్మీ జవాన్ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు బూరుగుపాలెంకు చెందిన గూనూరు భరత్(22)గా గుర్తించారు. ఏడాది క్రితం అగ్నివీర్ ఎంపికలో ఉద్యోగం పొందిన భరత్ శిక్షణ ముగించుకుని వెస్ట్ బెంగాల్‌లో ఉద్యోగం చేశాడు. ప్రేమించిన యువతి దూరమవుతుందని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. మృతదేహాన్ని శనివారం రాత్రి గ్రామానికి తీసుకొచ్చారు.
News January 19, 2025
తూ.గో: 20వ తేదీన యథావిధిగా పీజిఆర్ఎస్
ఈనెల 20వ తేదీన సోమవారం రాజమహేంద్రవరంలోని తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద యథావిధిగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఉదయం 10:00 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలందరూ గమనించాలని సూచించారు.