News April 2, 2025
ఏపీకి నూతన రైల్వే ప్రాజెక్టులు కేటాయించారా?: వేమిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వివరించాలని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కోరారు. వేమిరెడ్డి ప్రశ్నలకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్టవ్ సమాధానమిచ్చారు. రైల్వే ప్రాజెక్టుల కేటాయింపు రాష్ట్రాలు, జిల్లాల వారీగా ఉండదన్నారు. రైల్వే జోన్ల వారీగా ఉంటుందన్నారు. పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.
Similar News
News April 7, 2025
స్వగ్రామంలో వెంకయ్య నాయుడు పూజలు

మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు స్వగ్రామమైన వెంకటాచలం మండలం చౌటపాలెంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన తన మనువడు విష్ణుబాబుతో కలిసి సీతారాముల కళ్యాణంలో పాల్గొన్నారు. సమాజంలో కనిపిస్తున్న వివక్షలు, అసహనం వంటి సామాజిక రుగ్మతలకు శ్రీరాముడి ఆదర్శాలే సరైన పరిష్కారమని వెంకయ్య నాయుడు సూచించారు.
News April 6, 2025
శ్రీరాముని ఆదర్శాలతో వివక్షలు లేని సమాజం: వెంకయ్య

సమాజంలో నేటికీ అక్కడక్కడా కనిపిస్తున్న వివక్ష, అసహనం వంటి సామాజిక రుగ్మతలకు శ్రీరాముని ఆదర్శాలే సరైన పరిష్కారమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని వెంకటాచలం(మ) శ్రీరామపురం రామాలయంలో జరిగిన శ్రీ సీతారాములు కళ్యాణ మహోత్సవంలో అయన కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికీ శ్రీరాముడు ఆదర్శం కావాలని, ప్రతి గ్రామంలోనూ రామాయణ పారాయణం జరగాలన్నారు.
News April 6, 2025
నెల్లూరు: బస్ స్టాండ్‌లలో రద్దీ

నేడు(ఆదివారం) శ్రీరామనవమి సందర్భంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పలు RTC బస్ స్టాండ్‌లలో రద్దీ ఏర్పడింది. బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. దూర ప్రాంతాల్లో వ్యాపారులు, ఉద్యోగులు పండుగకు స్వగ్రామాలకు పయనం కావడంతో ఈ పరిస్థితి నెలకొంది. బస్ స్టాండ్‌లలో ఆకతాయిలు, జేబు దొంగల పట్ల ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.