News November 24, 2024

ఏపీకి పెట్టుబడుల వరద మొదలైంది: హోం మంత్రి అనిత

image

సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీకి పెట్టుబడుల వరద మొదలైందని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. తను ప్రాతినిత్యం వహిస్తున్న పాయకరావుపేట నియోజకవర్గం పరిధిలో రాజయ్య పేటలో ఉక్కు దిగ్గజ సంస్థలైన ఆర్సెలర్ మిట్టల్, నిప్పాన్ స్టీల్స్ ముందుకు రావడం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలక మలుపన్నారు. రూ.1.40 లక్షల కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసి 20,000 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు ఎక్స్‌లో పేర్కొన్నారు.

Similar News

News November 25, 2024

టెండర్ల ఆహ్వానంపై విశాఖ ఎంపీ స్పందన

image

దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయం నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించడంపై విశాఖ ఎంపీ శ్రీభరత్ స్పందించారు. ఇది ఎన్డీఏ ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రతిబింబిస్తున్నట్లు ఎంపీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. జోన్ స్థాపనలో కీలకపాత్ర పోషించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ జోన్ ద్వారా ఉత్తరాంధ్రకు భారీ ఆర్థిక ప్రయోజనాలు అందుతాయని అన్నారు.

News November 24, 2024

విశాఖ బీచ్‌లలో సందడి

image

రుషికొండ బీచ్‌కు పర్యాటకులు పోటెత్తారు. కార్తీకమాసంతో పాటు ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున బీచ్‌కు చేరుకున్నారు. ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. రుషికొండతో పాటు, ఆర్కే, యారాడ, భీమిలి, సాగర్ నగర్ బీచ్‌లలో పర్యాటకుల సందడి కనిపించింది. విశాఖలో మీకు ఇష్టమైన బీచ్ ఏదో కామెంట్ చెయ్యండి.

News November 24, 2024

విశాఖ జూలో సండే సందడి  

image

ఇందిరా గాంధీ జూపార్క్‌ను ఆదివారం 13,650 మంది సందర్శకులు వచ్చినట్లు జూ క్యూరేటర్ మంగమ్మ తెలిపారు. కార్తీక మాసం కావడంతో పెద్ద ఎత్తున వనయాత్రలకు వచ్చారన్నారు. రూ.9,61,724 ఆదాయం వచ్చిందని జూ క్యూరేటర్ తెలిపారు. ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున్న సందర్శకులు ఇందిరా గాంధీ జూ‌పార్క్‌కు రావడంతో సందడి వాతావరణం నెలకొంది.