News August 2, 2024

ఏపీకి ప్రత్యేక డైరెక్టర్‌ను నియమించాలి: విశాఖ ఎంపీ

image

ఏపీకి ఎంఎస్ఎంఈ ప్రత్యేక డైరెక్టర్‌ను నియమించాలని విశాఖ ఎంపీ శ్రీభరత్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రి జితన్ రామ్ మాంఝీను కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి తెలంగాణ, ఏపీ కార్యకలాపాలను ఒక్క డైరెక్టర్‌ మాత్రమే పర్యవేక్షిస్తున్నట్లు వినతి పత్రంలో పేర్కొన్నారు. గాజువాకలో ఉన్న ఎంఎస్ఎంఈ భవనాన్ని త్వరగా ప్రారంభించాలని కోరారు.

Similar News

News November 1, 2025

ప‌ర్యాట‌క ప్రాంతాలను ఆక‌ర్ష‌ణీయంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

image

న‌గ‌రంలోని పార్కుల‌ను, ప‌ర్యాట‌క ప్రాంతాల‌ను మ‌రింత ఆక‌ర్షణీయంగా తీర్చిదిద్దాల‌ని సంబంధిత అధికారుల‌ను క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ ఆదేశించారు. నగరంలోని పలు పార్కులను ఆయన సందర్శించారు. ఈనెల 14, 15వ తేదీల్లో జ‌రిగే ప్ర‌పంచ స్థాయి భాగ‌స్వామ సదస్సుకు దేశ విదేశాల నుంచి ప్రముఖులు నగరానికి వస్తారని తెలిపారు. అందుకు తగ్గట్టు చర్యలు చేపట్టాలని సూచించారు.

News November 1, 2025

విశాఖ నుంచి బయల్దేరిన మంత్రి లోకేశ్

image

విశాఖ విమానాశ్రయానికి మంత్రి నారా లోకేష్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు శనివారం సాయంత్రం చేరుకున్నారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ తొక్కిసిలాట ఘటనలో క్షతగాత్రులను వీరు పరామర్శించనున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. విశాఖ నుంచి రోడ్డు మార్గంలో మంత్రులు లోకేష్, అనిత, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు బయలుదేరి వెళ్లారు.

News November 1, 2025

విశాఖలో DRO నియామకం ఎప్పుడో?

image

విశాఖలో DRO, RDO మధ్య జరిగిన వివాదంతో ఇద్దరినీ బదిలీ చేశారు. DRO భవానీ శంకర్ స్థానంలో JCకి అదనపు బాధ్యతలు అప్పగించారు. అయితే మరో 2 వారాల్లో నగరంలో CII భాగస్వామ్య సదస్సుతో పాటు పలు కీలక సమావేశాలు జరగనున్నాయి. సాధారణంగా ప్రోటోకాల్ వ్యవహారాలు, ముఖ్య అధికారుల పర్యటనలు, ప్రభుత్వ కార్యక్రమాల సమన్వయం వంటి పనులన్నీ DRO పరిధిలో ఉంటాయి. ఈ సమయంలో DRO స్థానం ఖాళీగా ఉండడంతో వీటిపై ప్రభావం చూపే అవకాశం ఉంది.