News July 31, 2024
ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త.!

వాట్సాప్లో వచ్చే ఏపీకే ఫైల్స్ పట్ల మొబైల్ వినియోగదారులు తస్మాత్ జాగ్రత్త అంటూ ప్రకాశం పోలీసులు హెచ్చరించారు. ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు సైబర్ నేరాల నియంత్రణపై దృష్టి సారించారు. ఈ మేరకు వారు విడుదల చేసిన ప్రకటన ఆధారంగా.. ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసి సైబర్ నేరాల బారిన పడవద్దన్నారు. ఏవైనా సైబర్ ఫిర్యాదులను 1930కు చేయాలని సూచించారు.
Similar News
News December 9, 2025
పశ్చిమ ప్రకాశం వాసులకు తీరనున్న ప్రయాణ కష్టాలు

ఏపీ ప్రభుత్వం మార్కాపురం జిల్లా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఒకప్పుడు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే యర్రగొండపాలెం (135 km), మార్కాపురం (98 km), కనిగిరి (92 km)కి దూరం ప్రయాణించాల్సి వచ్చేదని పశ్చిమ ప్రకాశం ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు నూతన మార్కాపురం జిల్లాలో కలిపిన నియోజకవర్గాలకు జిల్లా కేంద్రం 65(km)లోపే ఉంటుంది. గిద్దలూరుకు మాత్రం ఒంగోలుతో పోల్చుకుంటే మార్కాపురం దగ్గరే.
News December 9, 2025
ప్రకాశం: గుండెల్ని పిండేసే దృశ్యం.!

ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలోని పెంచికలపాడు వద్ద సోమవారం 2 లారీలు ఢీకొని వ్యక్తి లారీలోనే <<18508533>>సజీవ దహనమయ్యాడు.<<>> లారీలో ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందడంతో బయటకు రాలేక నిస్సహాయ స్థితిలో డ్రైవర్ అగ్నికి ఆహుతయ్యాడు. అప్రమత్తమైన అధికారులు మంటలను అదుపుచేసి వ్యక్తి శరీర భాగాలను అతి కష్టంమీద బయటకు తీసి పోస్ట్మార్టం నిమిత్తం బేస్తవారిపేట ఆసుపత్రికి తరలించారు. ఫొటోలోని దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి.
News December 9, 2025
ఇళ్ల స్థలాల దరఖాస్తుల్లో పెండింగ్ ఉండరాదు: JC

ఇంటి నివేశన స్థలాల కోసం వచ్చిన దరఖాస్తులను సమగ్రంగా పరిశీలన చేసి అర్హులైన లబ్దిదారుల వివరాలను పెండింగ్లో లేకుండా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని జేసీ గోపాలకృష్ణ అన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్లో సోమవారం జేసీ మాట్లాడుతూ.. ఇంటి పట్టాల రీ- వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తిచేయాలన్నారు. అలాగే ఇంటి పట్టాల రీ-వెరిఫికేషన్పై MROలు ప్రత్యేక దృష్టి సారించి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.


