News January 6, 2025

ఏపీని అగ్రగామిగా నిలపడమే చంద్రబాబు సంకల్పం: ఉమా

image

ఏపీని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపడమే సీఎం చంద్రబాబు సంకల్పం అని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆదివారం ట్వీట్ చేశారు. విశాఖను ఆర్థిక రాజధానిగా, అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా, రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా సీఎం ప్రణాళిక సిద్ధం చేశారన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో రాష్ట్రంలోని ప్రతి ప్రాంతాన్ని కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని Xలో పేర్కొన్నారు.

Similar News

News January 9, 2026

గంజాయి అమ్మకాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు: కలెక్టర్

image

కృష్ణా జిల్లాలో గంజాయి అమ్మకాలను నియంత్రించేందుకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ అధ్యక్షతన నార్కోటిక్స్ సమన్వయ కమిటీ సమావేశం కలెక్టర్‌లో జరిగింది. జిల్లాలో ఎక్కడా గంజాయి, మాదకద్రవ్యాల అమ్మకాలు జరగరాదన్నారు. కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో గట్టి నిఘా ఉంచి అమ్మకాలను నియంత్రించాలన్నారు.

News January 9, 2026

కృష్ణా: Way2Newsలో రిపోర్టర్‌గా చేరాలనుకుంటున్నారా.!

image

కృష్ణా జిల్లాలోని పామర్రు, గుడివాడ, పెనమలూరు నియోజకవర్గాల్లో Way2Newsలో పనిచేయాడానికి రిపోర్టర్2లు కావలెను. ఆర్హత.. ఏదైనా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసిన అనుభవం ఉన్న వాళ్లకు మాత్రమే. ఆసక్తి గలవారు ఈ <>లింక్‌లో<<>> తమ పేర్లు నమోదు చేసుకోగలరు.

News January 9, 2026

మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్‌పై హైకోర్టు సీరియస్

image

మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వైసీపీ జిల్లా కార్యాలయ భవన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ సమర్పణ విషయంలో జరిగిన జాప్యంపై సీరియస్ అయింది. కోర్టు ఆదేశాలు పట్టవా..? అంటూ కమిషనర్‌ను నిలదీసింది. జాప్యానికి గల కారణాలపై వెంటనే అఫిడవిట్ వేయాలని ఆదేశిస్తూ విచారణను ఫిబ్రవరి 9కి వాయిదా వేశారు.