News December 17, 2024

ఏపీపీఎస్సీ పరీక్షలకు రంగం సిద్ధం: రెవెన్యూ అధికారి

image

ఏపీపీయస్సీ నిర్వహించే డిపార్ట్మెంట్ పరీక్షలు డిసెంబరు 18 నుంచి 23 వరకు జరగనున్నాయని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు సోమవారం తెలిపారు. భీమవరం డీఎన్ఆర్ అటానమస్ విభాగంలో ఆరు రోజులు పాటు పరీక్షలు జరగనున్నాయని, డిసెంబర్ 20 తాడేపల్లిగూడెం శశి ఇంజనీరింగ్ కాలేజీలో, డిసెంబర్ 22 మధ్యాహ్నం ఒక్క పూట మాత్రమే శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో డిపార్ట్మెంట్ పరీక్షలు జరుగుతాయన్నారు.

Similar News

News November 25, 2025

ప.గో: ఆన్‌లైన్‌లో పందెంకోళ్లు

image

సంక్రాంతి సమీపించడంతో కోడిపుంజుల విక్రయాలు జోరందుకుంటున్నాయి. బైక్‌లు, గృహోపకరణాల తరహాలోనే.. సోషల్‌ మీడియా వేదికగా పుంజుల ఫొటోలు, వీడియోలు, జాతి, బరువు వంటి వివరాలను పోస్ట్‌ చేస్తూ విక్రేతలు ఆకర్షిస్తున్నారు. పాలకొల్లులో రహదారుల పక్కన విక్రయాలు సాగుతుండగా.. దూర ప్రాంతాల నుంచి విచ్చేసి మరీ కొనుగోలు చేస్తున్నారు. జాతి, సైజును బట్టి ఒక్కో కోడి రూ.1500 నుంచి రూ.20,000 వరకు విక్రయిస్తున్నారు.

News November 25, 2025

భీమవరం: పీజీఆర్ఎస్‌కు 15 అర్జీలు

image

పాలకోడేరు మండలం గొల్లలకోడేరులోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 15 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ తెలిపారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, సంబంధిత పోలీస్ స్టేషన్లకు పంపి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.