News September 29, 2024
ఏపీలోని మైదుకూరులో రోడ్డు ప్రమాదం.. బాన్సువాడ వాసి మృతి
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణానికి చెందిన సయ్యద్ అహమదుల్లా శనివారం ఏపీలోని మైదుకూరు వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మైదుకూరు పోలీసుల వివరాల ప్రకారం.. పట్టణంలోని వీక్లీ మార్కెట్లో నివాసం ఉంటున్న సయ్యద్ అహ్మదుల్లా(39) బైకుపై వెళ్తున్న క్రమంలో టిప్పర్ ఢీకొట్టడంతో మృతి చెందినట్లు తెలిపారు. దీంతో పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
Similar News
News October 4, 2024
ప్రతిపక్షాల కుట్రలు తిప్పి కొట్టాలి: పొన్నం ప్రభాకర్
ప్రభుత్వంపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న కుట్రలను తిప్పి కొట్టాలని రాష్ట్ర రవాణా శాఖామంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. బిక్కనూరు మండల కేంద్రంలో ఆయన మాట్లాడారు. అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని గుర్తు చేశారు. రైతులను ప్రతిపక్ష పార్టీలు తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో పార్టీ శ్రేణులు వారి మాటలను తిప్పి కొట్టాలన్నారు.
News October 4, 2024
పిట్లం: ఇంటి నుంచి వెళ్లి చెరువులో శవమై తేలాడు..!
ఇంటి నుంచి వెళ్లిన ఓ వ్యక్తి చెరువులో శవమై కనిపించాడు. స్థానికుల వివరాలిలా..పిట్లం గ్రామానికి చెందిన జంగం విఠల్ గురువారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. వెళ్లిన అతను రాక పోయేసరికి కుటుంబీకులు ఎక్కడ వెతికినా జాడ లేదు. శుక్రవారం మారేడు చెరువు వైపు వెళ్లే వారికి చెరువులో విఠల్ శవం తేలియాడుతూ కనిపించింది. పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలికి చేరుకొని శవాన్ని బయటకు తీశారు.
News October 4, 2024
CM రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు: నిఖత్ జరీన్
TG పోలీసు శాఖలో DSP పదవితో సత్కరించినందుకు CM రేవంత్ రెడ్డికి బాక్సర్ నిఖత్ జరీన్ ‘X’ వేదికగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. CM రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లాఠీని అందుకున్న ఫోటోలను జత చేసిన ఆమె.. క్రీడలు తనకు మంచి వేదికను అందించాయని తెలిపారు. ఆ స్ఫూర్తి తనకు మరింత సామర్థ్యంతో సేవ చేయడానికి అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు. ఇది తన విజయం మాత్రమే కాదని సమిష్ఠి విజయమని పోస్టు చేశారు.