News October 2, 2024

ఏపీలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: మంత్రి కొండపల్లి

image

ఏపీలో ఎన్ఆర్ఐలు పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయమని ఏపీ MSME, NRI సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. డల్లాస్‌లోNRI తెలుగుదేశం ఆధ్వర్యంలో ఇన్వెస్టర్స్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తూ ప్రభుత్వ ఆధ్వర్యంలో త్వరలోనే ఒక పోర్టల్ ప్రారంభిస్తున్నామని, దీని ద్వారా పెట్టుబడులు పెట్టేవారు అన్ని రకాల అనుమతులు పొందడం సులభతరం అవుతుందని వెల్లడించారు.

Similar News

News October 18, 2025

మిగిలిన బాణసంచాను జాగ్రత్తగా భద్రపరచాలి: SP

image

దీపావళి సందర్భంగా కేఎల్‌పురం శివార్లలో ఏర్పాటు చేసిన బాణసంచా షాపులను ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ ఆకస్మికంగా పరిశీలించారు. వ్యాపారులు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని, షాపుల వద్ద నీరు, ఇసుక అందుబాటులో ఉంచాలని సూచించారు. గడువు ముగిసిన తరువాత మిగిలిన బాణసంచాను సురక్షిత గోడౌన్లలలో భద్రపర్చాలని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News October 18, 2025

ఈనెల 20న PGRS రద్దు: కలెక్టర్

image

ఈ నెల 20వ తేదీన దీపావళి పండగ సందర్బంగా ఆరోజు కలెక్టరెట్లో జరగనున్న PGRS రద్దు చేసినట్లు విజయనగరం కలెక్టర్ రాంసుందర్ రెడ్డి శనివారం ప్రకటించారు. తదుపరి వారం నుండి PGRS యథావిధిగా జరుగుతుందని తెలిపారు. ఈవారం PGRS రద్దు విషయాన్ని ఫిర్యాదుదారులు గమనించి కలెక్టరెట్‌కు రావద్దని సూచించారు.

News October 18, 2025

జిల్లాలో 2,645 హెక్టార్లలో ఆయిల్ ఫాం సాగు: కలెక్టర్

image

జిల్లాలో ప్రస్తుతం 2,645 హెక్టార్ల విస్తీర్ణంలో అయిల్ పామ్ సాగు అవుతుందని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి తెలిపారు. విజయనగరం రూరల్ మండలం కొండకరకాంలో సాగు అవుతున్న ఆయిల్ పామ్ తోటను కలెక్టర్ సందర్శించారు. 2025-26 సంవత్సరానికి 26 మండలాలు ఆయిల్ పామ్ సాగుకు అనుకూలంగా గుర్తించడం జరిగిందని 1850 హెక్టార్లు లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందన్నారు. శత శాతం రాయితీతో మొక్కలు పంపిణీ చేస్తామన్నారు.