News May 4, 2024

ఏపీలో భూహక్కు చట్టంతో భూ దోపిడీ : సీపీఐ  కె.రామకృష్ణ

image

ఏపీలో భూ హక్కు చట్టంతో రైతుల భూములు దోపిడీకి గురయ్యే ప్రమాదం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ చెప్పారు. రాష్ట్రంలో మద్యపానం నిషేధించాకే ఎన్నికల్లో ఓటు అడుగుతానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఒక్క హామీ అమలు చేయకుండా ఎన్నికలకు పోవడం సిగ్గుచేటన్నారు. వారం రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని జనం ఇంటికి పంపడం ఖాయమని ధ్వజమెత్తారు. తిరుపతిలో సీపీఐ తరుఫున ఆయన శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

Similar News

News November 5, 2024

తిరుపతి: సైబర్ క్రైమ్ అవగాహన వారోత్సవాలు ప్రారంభం

image

సైబర్ క్రైమ్ అవగాహన వారోత్సవాలను పద్మావతి యూనివర్సిటీ ఆడిటోరియంలో ఎస్పీ సుబ్బారాయుడు, ఉపకులపతి ఉమా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. డిజిటల్ ప్రపంచంలో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలని సూచించారు. సైబర్ నేరాలకు బలి కాకూడదన్నారు. సైబర్ నేరాలను అరికట్టడంతో పాటు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. అవగాహన లోపంతో సైబర్ నేరాలు జరుగుతున్నాయన్నారు. అవగాహన పెంచుకుని తోటి వారిని చైతన్య పరచాలన్నారు.

News November 5, 2024

తిరుపతి: విమానాశ్రయాలకు ధీటుగా రైల్వే స్టేషన్ ల ఆధునీకరణ

image

విమానాశ్రయాలకు ధీటుగా రైల్వే స్టేషన్లను ఆధునీకరించనున్నట్లు రైల్వే స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ CM రమేష్ తెలిపారు. వికసిత్ భారత్ లో భాగంగా PM నరేంద్ర మోడీ సారథ్యంలో రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తామన్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులతో కలిసి కేంద్ర రైల్వే రైల్వే కమిటీ సభ్యులు తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించారు. అవసరమైన చోట్ల రైల్వే అండర్, ఓవర్ బ్రిడ్జిలు నిర్మాణం చేస్తామన్నారు.

News November 4, 2024

దివ్యాంగులు పెట్రోల్ సబ్సిడీకి దరఖాస్తు చేసుకోండి

image

చిత్తూరు జిల్లాలోని దివ్యాంగుల మూడు చక్రాల వాహనాలకు సబ్సిడీ పెట్రోల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సోమవారం విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకుడు ఏ.వై శ్రీనివాసులు కోరారు. గుర్తింపు కలిగిన ప్రైవేటు సంస్థలలో పనిచేస్తూ సొంత మూడు చక్రాల మోటారు వాహనాలు గల దివ్యాంగుల నుంచి పెట్రోల్, డీజిల్ రాయితీ కోసం ఈనెల నవంబర్ 15 లోగా దరఖాస్తుతో పాటు సర్టిఫికెట్లు జతపరచాలన్నారు.