News August 28, 2024

ఏపీలో రూ.1,040 కోట్ల పన్ను ఎగవేత

image

AP CGST ఆడిట్‌ కమిషనరేట్‌ పరిధిలోని అనుమానస్పద వ్యాపార సంస్థల్లో చేపట్టిన ఆడిట్‌ తనిఖీల్లో రూ.1,040కోట్ల పన్ను ఎగవేతను గుర్తించినట్లు ఏపీ సీజీఎస్టీ ఆడిట్‌ కమిషనర్‌ పులపాక ఆనంద్‌కుమార్‌ తెలిపారు. వైజాగ్,గుంటూరు,తిరుపతి సర్కిళ్ల పరిధిలో ఈ ఏడాది జులై వరకు మొత్తం 370 అనుమానస్పద వ్యాపార సంస్థల్లో తనిఖీలు చేసి రూ.108కోట్లను రికవరీ చేశామన్నారు. తిరుపతిలోని సీజీఎస్టీ ఆడిట్‌ కార్యాలయాన్ని సందర్శించారు.

Similar News

News September 17, 2024

తిరుపతి: చాట్ బాట్ ద్వారా 310 ఫోన్లు రికవరీ

image

చాట్ బాట్ ద్వారా11వ విడతలో రూ.62 లక్షల విలువ గల 310 మొబైల్ ఫోన్లు రికవరీ చేసినట్లు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ…10 విడతలలో సుమారు రూ.6, 07 కోట్లు విలువచేసే 3,530 సెల్ ఫోన్లు బాధితులకు అందజేసినట్లు వెల్లడించారు. ఫోన్లు పోగొట్టుకున్న వారు వాట్సప్, ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని వివరించారు.

News September 17, 2024

తిరుమల అతిధి గృహంలో చిందులు అంటూ ఫేక్ ప్రచారం

image

తిరుమల అతిధి గృహంలో చిందులు అంటూ ఫేక్ ప్రచారం చేస్తున్నారని FactCheck.AP.Gov.in పేర్కొంది. వాస్తవానికి ఆగస్టు 29వ తేదీన విజయవాడ గురునానక్ కాలనీలో, మంత్రి సంధ్యారాణి ఇంట్లో జరిగిన కుమారుడి పుట్టిన రోజు ఫంక్షన్ వీడియో ఇది అని తెలిపింది. తిరుమల ప్రతిష్ట మంటగలిపేందుకు తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి అని ట్విటర్‌లో తెలిపింది.

News September 17, 2024

శ్రీవారి భక్తులకు నాణ్యమైన భోజనం అందించాలి: ఈవో

image

తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేస్తున్న భక్తులకు నాణ్యమైన భోజనం అందించాలని ఈవో శ్యామలరావు సూచించారు. మంగళవారం తిరుమలలో దుకాణదారులతో ఆయన సమావేశం అయ్యారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల ద్వారా వారికి అవగాహన కల్పించారు. నియమ నిబంధనలు, నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. పరిశుభ్రత, నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.