News February 12, 2025
ఏపీ కోళ్లను అనుమతించొద్దు: అడిషనల్ ఎస్పీ

ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ముదిగొండ మండలం వల్లభి చెక్ పోస్ట్ వద్ద వచ్చే కోళ్ల వాహనాలను అనుమతించొద్దని అడిషనల్ ఎస్పీ ప్రసాద్ రావు తెలిపారు. సీఐ మురళి, తహశీల్దార్ సునీత ఎలిజబెత్, పశు వైద్యాధికారులు అశోక్, రమేష్ బాబు, వైద్య అధికారి ధర్మేంద్ర, ఆర్ఐ ప్రసన్నకుమార్‌తో కలిసి వల్లభి చెక్ పోస్టు వద్ద ఆయన తనిఖీలు చేశారు. ఏపీ నుంచి వచ్చే కోళ్లను, ఇసుకను అనుమతించొద్దని సిబ్బందికి పలు సూచనలు చేశారు.
Similar News
News March 28, 2025
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

∆} వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన ∆} వైరాలో ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ పర్యటన ∆} ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} ఖమ్మం మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో CMRFచెక్కులు పంపిణీ ∆} సత్తుపల్లిలో కాంగ్రెస్ నేత దయానంద్ పర్యటన
News March 28, 2025
అణగారిన వర్గాల కోసం రాజకీయాల్లోకి వచ్చా: భట్టి

తాను యాక్సిడెంటల్‌గా రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడిని కాదని.. చాలా ఆలోచించి అణగారిన వర్గాల కోసం రాజకీయాల్లోకి వచ్చానని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గురువారం అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజల జీవన విధానం బాగుండాలని అశించానని.. మీలాగా దుర్బుద్ధితో వ్యక్తిగత స్వార్ధం కోసం రాజకీయాల్లోకి రాలేదని బీఆర్‌ఎస్ పై విమర్శలు గుప్పించారు.
News March 28, 2025
నేడు, రేపు ఖమ్మంలో మంత్రి తుమ్మల పర్యటన

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్ర, శనివారాలలో ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఖమ్మంలో జరిగే ఇఫ్తార్ విందు, పలు డివిజన్లలో శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. శనివారం ఖమ్మం పట్టణంతో పాటు రఘునాథపాలెం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న అనంతరం తల్లాడ మండలంలో పర్యటించనున్నారు.