News November 13, 2024

ఏపీ జట్టుకు కోచ్‌గా శ్రీరాములు

image

ఈనెల 17 నుంచి మధ్యప్రదేశ్‌లో జరగనున్న జాతీయస్థాయి స్కూల్ గేమ్స్ బ్యాడ్మింటన్ అండర్-17 ఏపీ జట్టుకు కోచ్‌గా ధర్మవరం ZP హైస్కూల్లో PD డా.పొట్లూరు శ్రీరాములు వ్యవహరించనున్నారు. ఈయన గతంలో భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్ గ్రేడ్-1 అంపైర్‌గా, అలాగే 2010లో న్యూఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ క్రీడలకు టెక్నికల్ అఫీషియల్‌గా వ్యవహరించారు. పలువురు క్రీడాకారులు బుధవారం ఆయనకు అభినందనలు తెలిపారు.

Similar News

News February 23, 2026

VZM: ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

image

జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలను కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇందులో భాగంగా కె.ఎల్.పురంలోని శ్రీ లక్ష్మీగణపతి జూనియర్ కళాశాలలోని పరీక్షా కేంద్రాన్ని ఆయన సందర్శించి, పరీక్షల నిర్వహణ తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులు పరీక్ష రాస్తున్న గదులను సందర్శించి, వారికి కల్పించిన వసతులపై అధికారులను ఆరా తీశారు.

News February 23, 2026

అమృత్ భారత్ రైళ్లకు కొత్తవలసలో హాల్ట్

image

కొత్తవలస రైల్వే స్టేషన్‌ను అమృత్ భారత్ పథకంలో చేర్చడంతో పలు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్ట్ కల్పించినట్లు వాల్తేరు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ పవన్ కుమార్ తెలిపారు. 16597/98, 16223/24, 16107/08, 16523/24 ఈ రైళ్లు కొత్తవలస, దువ్వాడ మీదుగా గమ్యస్థానాలకు చేరుకుంటాయన్నారు. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.