News December 5, 2024

ఏపీ ప్రభుత్వంతో గూగుల్ కీలక ఒప్పందం

image

ఏఐ రంగంలో అధునాతన ఆవిష్కరణల కోసం ఏపీ ప్రభుత్వం, గూగుల్ సంస్థ మధ్య గురువారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి లోకేశ్ సమక్షంలో గూగుల్ మ్యాప్స్ ఇండియా జనరల్ మేనేజర్ లలితా రమణి, ఏపీ రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ కార్యదర్శి సురేశ్ కుమార్ నడుమ అవగాహన ఒప్పందం జరిగింది. ఒప్పందం ప్రకారం ఏఐ రంగంలో వచ్చే మార్పులకు అనుగుణంగా ఏపీలోని పాఠశాలలు, కళాశాలల్లో గూగుల్ సంస్థ నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తుంది.

Similar News

News November 21, 2025

మేడికొండూరు: నిన్న కూతూరి పెళ్లి.. ఇవాళ గుండెపోటుతో తండ్రి మృతి

image

నిన్నటి పెళ్లి పందిరిలో సందడి ఇంకా ముగియక ముందే మేడికొండూరు మండలం డోకిపర్రులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 30 ఏళ్ల సుదీర్ఘ కాలంగా సీనియర్ పాత్రికేయుడిగా సేవలందిస్తున్న దావాల వెంకట రావు శుక్రవారం మధ్యాహ్నం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. నిన్ననే తన కూతురి వివాహాన్ని జరిపించి, ఆ ఆనందంలో ఉండగానే విధి ఇలా చిన్నచూపు చూసింది. మూడు దశాబ్దాలకు పైగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతూ ఎందరికో ఆదర్శంగా నిలిచారు.

News November 21, 2025

వర్షాలు పడే అవకాశం పంటలు జాగ్రత్త: కలెక్టర్

image

వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు ఈ నెల 27, 28న వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు పంటల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. నూర్పిడి జరిగిన పంటలు, కోతలు కోసిన పంటలు సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆమె రైతులకు సూచించారు. వ్యవసాయ అధికారులు రైతులకు సహకరించాలని, ధాన్యం వర్షానికి తడవకుండా చూడాలని అధికారులను ఆమె ఆదేశించారు.

News November 21, 2025

GNT: కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత దేవిప్రియ వర్ధంతి

image

ప్రముఖ కవి, రచయిత, పాత్రికేయుడు దేవిప్రియ (షేక్ ఖాజాహుస్సేన్) వర్ధంతి నేడు. గుంటూరులో జన్మించిన ఆయన ‘పైగంబర కవుల’ బృందంలో ఒకరు. ఆయన రచించిన ‘గాలిరంగు’ కవిత్వానికి 2017లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈయన పాత్రికేయుడిగా ‘ఉదయం’, ‘ఆంధ్రజ్యోతి’ వంటి దినపత్రికలలో పనిచేశారు. వ్యంగ్య, విమర్శనాత్మకమైన ఆయన ‘రన్నింగ్ కామెంటరీ’ కవిత్వం తెలుగు పత్రికా రంగంలో కొత్త ఒరవడిని సృష్టించింది.