News February 20, 2025
ఏపీ మోడల్ స్కూల్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

గోస్పాడులోని ఏపీ మోడల్ స్కూల్‌ను కలెక్టర్ జీ.రాజకుమారి గురువారం తనిఖీ చేశారు. పాఠశాల పరిసర ప్రాంతాలు, తరగతి గదులను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆర్వో ప్లాంట్‌లో లీకేజీ సమస్యను గుర్తించి మరమ్మతులు చేయించాలని కలెక్టర్ ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. పాఠశాలలోని ల్యాబ్ గదులన్నింటికీ తాళాలు వేయకుండా వాటిని క్రమం తప్పకుండా వినియోగంలోకి తీసుకురావాలని తెలిపారు.
Similar News
News October 16, 2025
జగిత్యాల: డిప్యూటీ కలెక్టర్(ట్రైనీ) బాధ్యతల స్వీకరణ

జగిత్యాల జిల్లా డిప్యూటీ కలెక్టర్(ట్రైనీ)గా కన్నం హరిణి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు కలెక్టరేట్లోనే డిప్యూటీ కలెక్టర్ ఛాంబర్లో ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలను అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో PRTUTS జగిత్యాల జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బోయినపల్లి ఆనందరావు, యాళ్ళ అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు.
News October 16, 2025
నిర్మల్: 3వ అంతస్తు నుంచి పడి యువకుడి మృతి

నిర్మల్ జి. కుబీర్ మం. కుప్టికి చెందిన రాజు జోర్డాన్‌లో మృతి చెందాడు. క్లాసిక్ ఫ్యాషన్ కంపెనీలో పనిచేస్తున్న రాజు ఈనెల 14న 3వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి అక్కడికక్కడే మరణించినట్లు సమాచారం. మృతదేహాన్ని ఆసుపత్రిలో భద్రపరిచారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బుధవారం ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ సభ్యుడు స్వదేశ్ పరికిపండ్లను కలిసి కుమారుడి మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు సహాయం చేయాలని వేడుకున్నారు.
News October 16, 2025
వరంగల్: ఎవరీ సుమంత్..!

మంత్రి సురేఖ వద్ద ఓఎస్డీగా పని చేసిన N.సుమంత్ ఎవరనేదీ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. వరంగల్‌కు చెందిన సుమంత్, సురేఖ కుమార్తె సుష్మిత ఇద్దరు క్లాస్మేట్స్. కుటుంబసభ్యుడిగా ఉండేవాడు. ఎన్నికల నాటి నుంచి సురేఖ వెంట ఉండి అన్నీ తానై నడిపించాడు. అధికారంలోకి రాగానే తన పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా తీసుకొని, అక్కడి నుంచి ఓఎస్డీ పోస్టును సృష్టించి తన వెంట పెట్టుకున్నారు సురేఖ.