News September 24, 2024

ఏపీ షెడ్యూల్ ట్రైకార్ ఛైర్మన్‌గా బొరగం శ్రీనివాసులు

image

రాష్ట్రంలో పలు నామినేటెడ్ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం భర్తీ చేస్తూ జాబితాను విడుదల చేసింది. ఈ సందర్భంగా మొత్తం కూటమి పార్టీల నుంచి 20 మందిని నామినేటెడ్ పోస్టులకు ఎంపిక చేసింది. ఈ జాబితాలో పోలవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ బోరగం శ్రీనివాసులకు ఏపీ స్టేట్ షెడ్యూల్ ట్రైకార్ ఛైర్మన్‌గా నియమించింది. నాయకుడికి దక్కిన గౌరవంగా కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలుపుతున్నారు.

Similar News

News October 25, 2025

రేపటి నుంచి 3 రోజులు బీచ్‌కి రావొద్దు: ఎస్సై

image

తుపాన్ హెచ్చరికల జారీ, సముద్రంలో అలల ఉద్ధృతి పెరిగిన కారణంగా ఈ నెల 26 నుంచి 28 వరకు పేరుపాలెం బీచ్‌లోకి సందర్శకులకు అనుమతి లేదని మొగల్తూరు ఎస్సై వాసు శనివారం తెలిపారు. వాతావరణంలోని మార్పుల వల్ల అలలు వేగంగా వస్తుండటంతో ప్రమాదం సంభవించే అవకాశం ఉందన్నారు. సందర్శకులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

News October 25, 2025

సురక్షా యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

భీమవరం కలెక్టరేట్‌ వద్ద కలెక్టర్ చదలవాడ నాగరాణి సురక్షా యాప్ వినియోగం, ప్లాస్టిక్ నిషేధం, గంజాయి, మత్తు పదార్థాల తనిఖీలు, ఎక్సైజ్ శాఖ ప్రగతి తదితర అంశాలపై ఎక్సైజ్ అధికారులతో సమీక్షించారు. కల్తీ అక్రమ మద్యాన్ని పూర్తిగా నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారులకు సురక్షా యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. వినియోగదారులు ఈ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News October 25, 2025

ఆక్వా సాగు చెరువులు తప్పనిసరిగా CAA కింద రిజిస్టర్ కావాలి: కలెక్టర్

image

ఉప్పునీటి ఆక్వా సాగు చెరువులు తప్పనిసరిగా కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ (CAA) కింద రిజిస్టర్ కావాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లాస్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. రిజిస్టర్ కాని చెరువులకు చట్టబద్ధత ఉండదని, సీఏఏ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఆక్వా సాగు నిర్వహించాలని సూచించారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.