News September 24, 2024
ఏపీ స్టేట్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఛైర్మన్గా సుజాత

రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులను ప్రభుత్వం మంగళవారం భర్తీ చేసింది. మొత్తం 20 మందిని నామినేటెడ్ పోస్టులకు ఎంపిక చేస్తూ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో చింతలపూడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీమంత్రి పీతల సుజాతను ఏపీ స్టేట్ కన్జ్యూమర్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఛైర్మన్గా నియమించింది. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న ఆమెకు తగిన గౌరవం దక్కిందని కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 12, 2025
దివ్యాంగులకు ప్రభుత్వ సహకారం: కలెక్టర్ నాగరాణి

ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగులను ఎంతో ఓర్పుతో సాకాల్సి ఉంటుందని కలెక్టర్ నాగరాణి అన్నారు. వారి ఇబ్బందులకు ఎల్లప్పుడూ ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయని, ధైర్యంగా ఉండాలని ఆమె భరోసా ఇచ్చారు. భీమవరంలో గాలి రామయ్య మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఉన్న ‘భవిత విలీన విద్య వనరుల కేంద్రాన్ని సందర్శించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగ బాలికలకు ఉచిత ఉపకరణాల పంపిణీ, వైద్య నిర్ధారణ శిబిరాన్ని పరిశీలించారు.
News November 12, 2025
ఆకివీడు: డిప్యూటీ సీఎం చొరవతో నేడు గృహప్రవేశం

చెత్త కాగితాలు ఏరుకుంటూ జీవిస్తున్న ఆకివీడుకు చెందిన వృద్ధురాలు కంకణాల కృష్ణవేణి ఇళ్లు లేక ఇబ్బంది పడుతోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ను గత మూడు నెలల క్రితం మంగళగిరిలో ఆమె పవన్ను కలిసి తన గోడును విన్నవించుకుంది. పవన్ ఆదేశాలతో ఇంటి నిర్మాణంలో భాగంగా, నేడు కలెక్టర్ నాగరాణి చేతుల మీదుగా కృష్ణవేణి గృహప్రవేశం చేసింది. సొంతింటి కల నెరవేరడంతో ఆమె సంతోషం వ్యక్తం చేసింది.
News November 12, 2025
తణుకు: కూతురి హత్య కేసులో తల్లిదండ్రులు అరెస్ట్

తణుకు మండలం ముద్దాపురంలో మూడేళ్ల కిందట యువతి సజీవ దహనం కేసులో ఆమె తండ్రితో పాటు సవతి తల్లిని బుధవారం తణుకు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ కృష్ణ కుమార్ వివరాల మేరకు.. యువతికి చెందిన ఆస్తి కోసం సవతి తల్లి ముళ్లపూడి రూప, శ్రీనివాసు ఆమెను సజీవదహనం చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అప్పట్లో పనిచేసిన పోలీసు అధికారుల పాత్రపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.


