News March 28, 2025

ఏప్రిల్ 1న పదో తరగతి సోషల్ పరీక్ష: విశాఖ డీఈవో

image

రంజాన్ మార్చి 31న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని డీఈవో ప్రేమ్ కుమార్ శుక్రవారం తెలిపారు. అయితే పదో తరగతి సోషల్ పరీక్ష మార్చి 31వ తేదీన నిర్వహించనున్నట్లు ముందు హల్ టికెట్స్‌లో ప్రచురితం చేశారని, రంజాన్ పండుగ కావడంతో ఏప్రిల్ 1న పరీక్ష నిర్వహించనున్నట్లు డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాలన్నారు.

Similar News

News April 3, 2025

పిల్లలకు పొగాకు అమ్మితే ఏడేళ్లు జైలు: విశాఖ సీపీ

image

విశాఖ నగర పరిధిలో స్కూల్స్, కాలేజీలకు 100 మీటర్ల పరిధిలో పొగాకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. సీపీ కార్యాలయంలో గురువారం అధికారులతో సమావేశమయ్యారు. పొగాకు వల్ల రాష్ట్రంలో ప్రతి ఏడాది 48వేల మరణాలు సంభవిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో రోజుకి 250 మంది పిల్లలు పొగాకు వాడుతున్నారన్నారు. పిల్లలకు పొగాకు అమ్మితే ఏడేళ్లు జైళ్ళు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తామన్నారు.

News April 3, 2025

రికార్డు సృష్టించిన ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్

image

ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR) 2024-25 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో సరుకు రవాణా చేసిందని జనరల్ మేజేజర్ పరమేశ్వర్ ఫంక్వాలా తెలిపారు. 259.254 మిలియన్ల టన్నుల సరకు రవాణ చేసి కొత్త బెంచ్‌మార్క్‌ను దాటిందని వెల్లడించారు. గతంలో ఉన్న 259 మిలియన్ల టన్నుల మార్కుని దాటిని దేశంలోని మొదటి రైల్వే జోన్‌గా ECoR అవతరించిందని పేర్కొన్నారు. 

News April 3, 2025

బ్యాంకు ప్రతినిధులతో విశాఖ కలెక్టర్ సమావేశం

image

స్వ‌యం ఉపాధి పొందాల‌నుకునే అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు బ్యాంకులు పూర్తి స‌హ‌కారం అందించాల‌ని సంబంధిత అధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ హరేంధిర ప్ర‌సాద్ ఆదేశించారు. ప‌లువురు బ్యాంకు ప్ర‌తినిధుల‌తో గురువారం క‌లెక్ట‌రేట్ మీటింగ్ హాలులో సమావేశం అయ్యారు. రుణాల మంజూరులో సుల‌భ‌త‌ర విధానాలు పాటిస్తూ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని సూచించారు. స్వ‌యం ఉపాధి పొందాల‌నుకునే వారికి త‌గిన విధంగా అండ‌గా నిల‌వాల‌న్నారు.

error: Content is protected !!