News March 29, 2025
ఏప్రిల్ 1 వరకు నాగర్‌కర్నూల్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్

నాగర్ కర్నూల్ జిల్లాకు హైదరాబాద్ వాతావరణ శాఖ శనివారం విడుదల చేసిన రిపోర్ట్‌లో ఏప్రిల్ ఒకటి వరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈరోజు నుంచి ఏప్రిల్ ఒకటి వరకు జిల్లాలో ఎండల తీవ్రత కొనసాగనుంది. 40 డిగ్రీల వరకు జిల్లాలో ఉష్ణోగ్రతల నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా వృద్ధులు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ అధికారులు హెచ్చరించారు.
Similar News
News December 7, 2025
టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

టాటా, మారుతి సుజుకీ DECలో కార్లపై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నాయి. మారుతి Invictoపై ₹2.15 లక్షల వరకు తగ్గింపు ప్రకటించింది. ₹లక్ష క్యాష్ డిస్కౌంట్, ₹1.15 లక్షల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ఇవ్వనుంది. Fronxపై ₹88వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. హారియర్, సఫారీ SUVలపై ₹75 వేల వరకు క్యాష్ డిస్కౌంట్‌ను టాటా అందిస్తోంది. పాత మోడల్ తీసుకుంటే ₹లక్ష దాకా రాయితీ ఇవ్వనుంది. ఇతర మోడల్స్కూ ₹25K-55K డిస్కౌంట్స్ ఇస్తోంది.
News December 7, 2025
VKB: నామినేషన్ల ఉపసంహరణ .. బుజ్జగింపుల పర్వం

వికారాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్ల నామినేషన్ల ఘట్టం ముగియడంతో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. తీవ్ర పోటీ ఉన్న స్థానాల్లో, పోలింగ్‌కు ముందే తమ అభ్యర్థులను ఉపసంహరించుకోవాలని ప్రధాన పార్టీల నాయకుల బుజ్జగింపులు మొదలయ్యాయి. మూడో విడత ఉపసంహరణ గడువు ఈ నెల 9న ఉండటంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రత్యర్థులను విత్ డ్రా చేయించేలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
News December 7, 2025
కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మరో కేసు నమోదు

మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై వెంకటాచలం పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదయింది. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు.. ఆధారాలు లేకుండా అవినీతి ఆరోపణలు చేశారంటూ టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాధాకృష్ణ నాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో ఈ పోలీస్ స్టేషన్లో పలు కేసులు కాకాణిపై ఉన్నాయి.


