News April 9, 2025

ఏప్రిల్ 10 నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

image

తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 10 నుంచి 12వ తేదీ వరకు మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీ. వసంతోత్సవాన్ని పురస్కరించుకొని కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.

Similar News

News November 23, 2025

సర్పంచ్ ఎన్నికల ఖర్చు అంతే!

image

TG: సర్పంచ్ ఎన్నికల ఖర్చు విషయంలో ఎన్నికల సంఘం అధికారులు మరోసారి స్పష్టత ఇచ్చారు. 2011 సెన్సెస్ ఆధారంగా ఖర్చు ఉంటుందని వెల్లడించారు. 5వేల ఓటర్లకు పైగా ఉన్న గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థి రూ.2.50 లక్షలు, 5 వేల లోపు పంచాయతీల్లో రూ.1.50 లక్షలు, 5 వేలకు పైగా జనాభా ఉన్న గ్రామాల్లో వార్డు సభ్యులకు రూ.50 వేలు, 5 వేలకు తక్కువగా ఉన్న గ్రామాల్లో రూ.30 వేల చొప్పున ఖర్చు పెట్టాల్సి ఉంటుందని వివరించారు.

News November 23, 2025

నెల్లూరు: ఈ నంబర్ మీ వద్ద ఉందా.?

image

వివిధ సమస్యలపై అర్జీలు ఇచ్చిన వారు అవి ఏ దశలో ఉన్నాయో తెలుసుకోడానికి కాల్ సెంటర్ నంబర్ 1100ను వినియోగించుకోవాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఇచ్చిన అర్జీకి అధికారులు సరైన సమాధానాలు ఇవ్వకున్నా ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. ప్రతీ సోమవారం నెల్లూరు కలెక్టరేట్‌లో నేరుగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామని, అర్జీలను అధికారిక వెబ్‌సైట్ Meekosam.ap.gp.inలో సైతం ఇవ్వొచ్చని కలెక్టర్ తెలిపారు.

News November 23, 2025

రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు విడుదల చేయాలని మంత్రికి వినతి

image

పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ హుస్నాబాద్ డివిజన్ రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతిపత్రం సమర్పించారు. రెండేళ్లుగా బకాయిలు రాక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, బకాయిలు విడుదలయ్యేలా సహకరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.