News March 11, 2025

ఏప్రిల్ 11 నుంచి ఎంజీయూ డిగ్రీ పరీక్షలు

image

MGU పరిధిలోని డిగ్రీ పరీక్షలు ఏప్రిల్ 11 నుంచి నిర్వహించనున్నట్లు సీఈవో డా. జి. ఉపేందర్ రెడ్డి తెలిపారు. డిగ్రీ 1వ సెమిస్టర్ ఏప్రిల్ 11, 3వ సెమిస్టరు APR 16, 5వ సెమిస్టర్ APR15 నుండి బ్యాక్లాగ్ విద్యార్థులకు, 2, 4, 6 సెమిస్టర్ల రెగ్యులర్ & బ్యాక్ లాగ్ విద్యార్థులకు ఏప్రిల్ 16 నుంచి నిర్వహించనున్నట్లు వివరించారు. పరీక్షల పూర్తి టైమ్ టేబుల్ MGU వెబ్ సైట్‌లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు.

Similar News

News October 25, 2025

బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వాలని మిల్లర్లకు కలెక్టర్ ఆదేశం

image

వానాకాలం ధాన్యం సేకరణలో భాగంగా ఇంకా బ్యాంక్ గ్యారంటీలు సమర్పించని రైస్ మిల్లర్లు తక్షణమే వాటిని అందజేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఆమె మిల్లర్లతో సమావేశమయ్యారు. ధాన్యం తడవకుండా, రైతులకు ఇబ్బంది లేకుండా వెంటనే అన్‌లోడ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.

News October 25, 2025

అవంతిపురంలో రైస్ మిల్లు తనిఖీ చేసిన కలెక్టర్

image

మిర్యాలగూడ మండలం అవంతిపురంలోని సూర్య తేజ రైస్ ఇండస్ట్రీస్‌ను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా సందర్శించారు. మిల్లులో జరుగుతున్న ధాన్యం ప్రాసెసింగ్ విధానాన్ని, బాయిల్డ్ రైసు తయారీని పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలపై దృష్టి సారించాలని మిల్లు యజమానికి కలెక్టర్ సూచించారు.

News October 25, 2025

NLG: అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి..!

image

జిల్లాలో ఆబ్కారీ శాఖ అంచనా తప్పింది. ఇబ్బడిముబ్బడిగా వచ్చే దరఖాస్తులతో దండిగా రాబడి ఉంటుందని భావించిన ఎక్సైజ్ శాఖకు చుక్కెదురైంది. ఆదాయంలో తేడా రాకున్నా.. దరఖాస్తుల నమోదు (4906)లో మాత్రం భారీ వ్యత్యాసం కనిపించింది. గతంతో పోలిస్తే ఏకంగా 2 వేల దరఖాస్తులు తక్కువ రావడం అధికారులను నివ్వెరపోయేలా చేసింది. అయితే, దరఖాస్తు ధర రూ.3 లక్షలు నిర్దేశించడంతో ఇది ఆదాయాన్ని గణనీయంగా పెంచింది.