News March 11, 2025
ఏప్రిల్ 11 నుంచి ఎంజీయూ డిగ్రీ పరీక్షలు

MGU పరిధిలోని డిగ్రీ పరీక్షలు ఏప్రిల్ 11 నుంచి నిర్వహించనున్నట్లు సీఈవో డా. జి. ఉపేందర్ రెడ్డి తెలిపారు. డిగ్రీ 1వ సెమిస్టర్ ఏప్రిల్ 11, 3వ సెమిస్టరు APR 16, 5వ సెమిస్టర్ APR15 నుండి బ్యాక్లాగ్ విద్యార్థులకు, 2, 4, 6 సెమిస్టర్ల రెగ్యులర్ & బ్యాక్ లాగ్ విద్యార్థులకు ఏప్రిల్ 16 నుంచి నిర్వహించనున్నట్లు వివరించారు. పరీక్షల పూర్తి టైమ్ టేబుల్ MGU వెబ్ సైట్‌లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు.
Similar News
News March 25, 2025
NLG: SLBC ఘటన.. మృతుడు ఇతడే!

SLBC టన్నెల్‌లో గత నెల 22న జరిగిన దుర్ఘటనలో ఎనిమిది మంది చిక్కుకోగా అందులో <<15882600>>ఈరోజు లభ్యమైన మృతదేహం<<>> UPలోని సఫీపురఉన్నా జిల్లా బంగర్‌మావు గ్రామానికి చెందిన మనోజ్ కుమార్ (51)గా తెలిసింది. ఈయన కొన్నేళ్లుగా జయప్రకాశ్ అసోసియేట్స్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అందజేసి ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల పరిహారం అందజేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
News March 25, 2025
NLG: ప్రాణం తీసిన ఈత సరదా

నల్గొండ జిల్లా దండెంపల్లి<<15883784>> SLBC కాలువలో<<>> ఇద్దరు యువకులు గల్లంతైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో నాగార్జున డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థి పోతుగంటి ఉదయ్ కుమార్ మృతి చెందాడు. పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో యువకుడి మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడు సూర్యాపేట జిల్లా నాగారం వాసిగా గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News March 25, 2025
BREAKING: దండెంపల్లి SLBC కాలువలో ఇద్దరు గల్లంతు

నల్గొండ జిల్లా దండెంపల్లి SLBC కాలువలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. నేటి ఉదయం ఆరుగురు యువకులు దండెంపల్లి SLBC కాలువలో ఈతకు వెళ్లగా ప్రమాదవశాత్తు ఇద్దరు గల్లంతయ్యారని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.