News March 27, 2025
ఏప్రిల్ 3న వేములవాడకు రానున్న ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్

ఏప్రిల్ 3వ తేదీన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, ఐదుగురు సభ్యులు జిల్లాలో పర్యటించనున్నారు. చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు కుస్రం నీలా దేవి, రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణికుంట ప్రవీణ్ వచ్చే నెల 3వ తేదీన జిల్లాలోని వేములవాడకు సాయంత్రం చేరుకుంటారు. 4వ తేదీన ఉదయం 6 గంటలకు శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుంటారు. ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.
Similar News
News December 19, 2025
రేపు పెరవలికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం పెరవలిలో పర్యటించనున్నారు. ఉదయం 9:20 గంటలకు మంగళగిరి నుంచి బయలుదేరి, 10:50 గంటలకు పెరవలి చేరుకుంటారు. రూ.3,040 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ‘అమరజీవి జలధార’ ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు తిరిగి మంగళగిరి బయలుదేరుతారని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.
News December 19, 2025
GNT: మోసం కేసు ఛేదించిన పోలీసులకు SP ప్రశంసలు

డిజిటల్ అరెస్ట్ పేరుతో జరిగిన సైబర్ మోసం కేసును సాంకేతికంగా ఛేదించి నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన ప్రత్తిపాడు, కాకుమాను పోలీసులను ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు. ఈ కేసులో సమర్థవంతంగా గుంటూరు పశ్చిమ డీఎస్పీ బానోదయ భానోదయ ఆధ్వర్యంలో దర్యాప్తు నిర్వహించిన పోలీస్ అధికారులు, సిబ్బందికి ఎస్పీ ప్రశంసా పత్రాలు అందజేసి ప్రత్యేకంగా ప్రశంసించారు.
News December 19, 2025
సుబ్రహ్మణ్యం.. అప్పన్న కలిసే కుట్ర చేశారు.?

తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఏ-29 సుబ్రహ్మణ్యం, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాజీ PA చిన్న అప్పన్న కలిసి ఉద్దేశపూర్వకంగా కుట్రచేశారని కోర్టులో వాదనలు జరిగాయని తెలుస్తోంది. ప్లాంట్ తనిఖీ చేయకుండా, డెయిరీలవారితో కలిసి తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేశారని సిట్ తేల్చినట్లు సమాచారం. దీని ప్రకారం కేసు ఓ కొలిక్కి వచ్చినట్లు న్యాయవాదులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


