News March 27, 2025
ఏప్రిల్ 3న వేములవాడకు రానున్న ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్

ఏప్రిల్ 3వ తేదీన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్, ఐదుగురు సభ్యులు జిల్లాలో పర్యటించనున్నారు. చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు కుస్రం నీలా దేవి, రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణికుంట ప్రవీణ్ వచ్చే నెల 3వ తేదీన జిల్లాలోని వేములవాడకు సాయంత్రం చేరుకుంటారు. 4వ తేదీన ఉదయం 6 గంటలకు శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకుంటారు. ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.
Similar News
News April 25, 2025
ఆమె చదువు అమూల్యం.. అతని సాయం చిరస్మరణీయం

AP: పల్నాడు జిల్లా నాదెండ్ల మండలంలోని జెడ్పీ హైస్కూల్ విద్యార్థిని అమూల్యకు టెన్త్‌లో 593 మార్కులు వచ్చాయి. పేద కుటుంబం నుంచి వచ్చిన ఆ చదువుల తల్లిని కలెక్టర్ అరుణ్‌బాబు సత్కరించారు. ఆమె పేరెంట్స్ అనిల్, రూతమ్మ కూలి పనులకు వెళ్తేనే పూట గడుస్తుందని తెలుసుకుని ఆయన చలించిపోయారు. వెంటనే ఒక ఎకరం పొలం మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
News April 25, 2025
పిట్లం: తర్బూజా సాగు.. లాభం బహు బాగు..!

బతుకు దెరువు కోసం 10 ఏళ్లు దుబాయ్ వెళ్లిన వ్యక్తి సొంత గడ్డపై వ్యవసాయం చేస్తూ లాభాల పంట పండిస్తున్నాడు. పిట్లం మండలం చిన్న కొడప్గల్ గ్రామానికి చెందిన సలీం ఖాన్ పిట్లంలో ఆరు ఎకరాల భూమిని ఏడాదికి రూ. 1.20 లక్షలకు కౌలుకు తీసుకుని తర్బూజా సాగు చేపట్టాడు. ఇందుకు రూ. 4.50 లక్షల పెట్టు బడి పెట్టాడు. ప్రస్తుతం పంట బాగా రావడంతో ఏకంగా రూ. 9 లక్షల లాభం పొందాడని సలీమ్ Way2 Newsతో గురువారం తెలిపాడు.
News April 25, 2025
విశాఖ రేంజ్‌లో 9 మంది ఇన్స్పెక్టర్లు బదిలీ

విశాఖ రేంజ్ పరిధిలో 9 మంది పోలీస్ ఇన్స్పెక్టర్లను గురువారం డీఐజీ గోపినాథ్ జెట్టి బదిలీ చేశారు. ఈ మేరకు విశాఖ రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి గురువారం ఉత్తర్వులు విడుదల చేశారు. బదిలీ అయిన ఇన్స్పెక్టర్లు తక్షణమే సంబంధిత బదిలీ స్థానంలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరిలో కొందరు అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళ జిల్లాకు బదిలీ అయ్యారు.