News March 30, 2025

ఏప్రిల్ 3 నుంచి 10వ తరగతి మూల్యాంకన: DEO  

image

పదో తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనను మొత్తం 1,032 మంది సిబ్బంది నిర్వహిస్తారని జిల్లా విద్యాశాఖ అధికారిని ఎల్ చంద్రకళ తెలిపారు.ఏప్రిల్ 3 తేదీ నుంచి 9వ తేదీ వరకు జరిగే మూల్యాంకనం రెడ్డి కళాశాలలో ఏర్పాటు చేశామన్నారు.111 మంది చీఫ్ ఎగ్జామినర్‌లు, 651 మంది ఎగ్జామినర్‌లు, 270 మంది స్పెషల్ అసిస్టెంట్లను ఇందు కోసం నియమించామన్నారు. ఒక ఎగ్జామినర్ ప్రతిరోజు 40 పేపర్‌లను మూల్యాంకనం చేయాల్సి ఉంటుందన్నారు.  

Similar News

News November 21, 2025

బాపట్ల: నూతన అక్రిడిటేషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

image

బాపట్ల జిల్లాలో పనిచేస్తున్న పాత్రికేయులకు రెండేళ్ల కాలపరిమితికి జారీ చేసే నూతన అక్రిడిటేషన్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ గురువారం ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తులను http://mediarelations.apgov.in లో సమర్పించాలన్నారు. అర్హత కలిగిన పాత్రికేయులు పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో ఈ నెల 21 నుంచి నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు.

News November 21, 2025

రామానాయుడు, అన్నపూర్ణ స్టూడియోస్‌కు నోటీసులు

image

GHMC ఖజానాకు గండికొడుతున్న సినిమా స్టూడియోలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. బంజారాహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియో విస్తీర్ణానికి ₹11.52 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉండగా యాజమాన్యం ₹49 వేలు చెల్లింస్తోందని గుర్తించారు. జూబ్లీహిల్స్‌లోని రామనాయుడు స్టూడియో విస్తీర్ణం తక్కువ చూపుతూ ₹1.92 లక్షలు చెల్లించాల్సి ఉండగా ₹1,900 చెల్లిస్తుండడంతో GHMC సర్కిల్ 18 అధికారులు నోటీసులు జారీ చేశారు.

News November 21, 2025

కొమరోలు: గుండెపోటుతో ప్రభుత్వ ఉద్యోగి మృతి

image

కొమరోలు మండలం తాటిచెర్ల విద్యుత్ శాఖ లైన్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న ఎం.బీకోజీ నాయక్ (42) గుండె పోటులో మృతి చెందారు. ఇతని స్వగ్రామం పుల్లలచెరువు గ్రామం కాగా తాటిచర్ల విద్యుత్ లైన్‌మెన్‌గా కొన్ని ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. కొమరోలు విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ ఉద్యోగులు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.