News March 28, 2025

ఏప్రిల్ 5లోపు అప్లై చేసుకోండి: భద్రాద్రి కలెక్టర్

image

భద్రాద్రి జిల్లాలోని బీసీ, ఎంబీసీ, బీసీ ఫెడరేషన్ (EBC, EWS) నిరుద్యోగులైన యువతీ, యువకులు రాజీవ్ యువ వికాసం పథకానికి ఏప్రిల్‌ 5లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకానికి బీసీ, ఎంబీసీ కులాలకు చెందిన వారు అర్హులని, రాజీవ్ యువ వికాసం ద్వారా యువత ఆర్థిక, స్వయం ఉపాధిని పెంపొందించుకునే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు.

Similar News

News December 7, 2025

గురుస్వాముల పాత్ర ఏంటో తెలుసా?

image

గురుస్వామి త్రికరణశుద్ధితో, నిష్కళంక మనస్సుతో ఉంటారు. శాంతి, సత్యం, సమానం వంటి దైవ గుణాలతో మెలుగుతారు. దీక్ష తీసుకున్నప్పటి నుంచి నిగ్రహం, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతారు. ఇతరుల భక్తిని, సేవను ప్రోత్సహిస్తూ వారికి మార్గదర్శనం చేస్తారు. అయ్యప్ప సేవలో నిమగ్నమై, ఇతరుల పొరపాట్లను దండించకుండా క్షమిస్తారు. భక్తులకు దీక్షా నియమాలను స్పష్టంగా తెలుపుతూ, అన్ని విధాలా సహాయం చేస్తారు. <<-se>>#AyyappaMala<<>>

News December 7, 2025

ADB: ఏడాదికోసారి ఎలక్షన్ వస్తే ఎంత బాగుంటుందో..!

image

పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓటర్లు అభ్యర్థుల నుంచి ఇష్టారీతిన డబ్బులు వసూలు చేస్తూ పండగ చేసుకుంటున్నారు. ఇదే అదనుగా భావించి ‘కాస్ట్‌లీ మందు కావాలి’, ‘వారసంతకు వెళ్లాలి’, ‘ఇంట్లో సామాన్ లేదు’ అంటూ అభ్యర్థులను డబ్బుల కోసం అడుగుతున్నారు. ఇక దావతులు, పార్టీల సంగతి చెప్పనక్కర్లేదు. సంవత్సరానికి ఒకసారి ఎన్నికలు వస్తే ఇంట్లో దోకా ఉండదని, తమ ఖర్చులన్నీ వసూలు చేసుకోవచ్చని పలువురు బహిరంగంగా చెబుతున్నారు.

News December 7, 2025

నేడు ప.గో నుంచి ప్రత్యేక రైలు

image

ప.గో జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లను నేటి నుంచి నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. రైలు నంబర్ 01781 చర్లపల్లిలో ఈ రోజు రాత్రి 9:30 గంటలకు బయలదేరి 8న రాత్రి 11:50 గంటలకు షాలిమారుకు చేరుకుంటుంది. తిరిగి చర్లపల్లికి( 01782) 10వ తేదిన సాయంత్రం 4 గంటలకు రానుంది. ఈ ట్రైన్ ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట మీదుగా నడుస్తుంది.