News March 27, 2025
ఏప్రిల్ 6న భద్రాచలానికి రావాలని సీఎంకు ఆహ్వానం

భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో ఏప్రిల్ 6న గిరిజన మ్యూజియం ప్రారంభం కానుండగా, ఈ వేడుకకు ముఖ్యఅతిథిగా రావాలని సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, భద్రాచల ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఐటీడీఏ పీవో రాహుల్, ఏపీవో డేవిడ్ రాజు ఆహ్వాన పత్రిక అందజేసి స్వాగతించారు. సీఎం సానుకూలంగా స్పందించారు.
Similar News
News November 15, 2025
మల్యాలలో వీఓఏల సమావేశం

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మల్యాల బ్రాంచ్ పరిధిలోని వివోఏల ప్రత్యేక సమావేశం శనివారం సెర్చ్ కార్యాలయంలో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎన్జడ్బీ బ్రాంచ్ ఏజీఎం శ్రీలత మాట్లాడుతూ.. జగిత్యాలలో ఈ నెల 18న రుణమేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన ప్రతి మహిళా సంఘ సభ్యురాలికి బ్యాంకు రుణాలను అందించాలని ఆమె వివోఏలను కోరారు. ఈ కార్యక్రమంలో రాంకుమార్, పాషా, ఏపీఎం దేవరాజం పాల్గొన్నారు.
News November 15, 2025
JGTL: నువ్వులు క్వింటాల్ ధర @9,666

జగిత్యాల వ్యవసాయ మార్కెట్లో శనివారం (15-11-2025) వివిధ దినుసుల ధరలు ఇలా ఉన్నాయి. మక్కలు క్వింటాల్ గరిష్ఠ ధర రూ.2061, కనిష్ఠ ధర రూ.1751, వరి ధాన్యం (1010) గరిష్ఠ ధర రూ.2055, కనిష్ఠ ధర రూ.1985, వరి ధాన్యం (BPT) ధర రూ.2061, వరి ధాన్యం (HMT) గరిష్ఠ ధర రూ.2160, కనిష్ఠ ధర రూ.2000, వరి ధాన్యం (JSR) గరిష్ఠ ధర రూ.2880, కనిష్ఠ ధర రూ.1950, నువ్వుల ధర రూ.9666గా మార్కెట్ అధికారులు తెలిపారు.
News November 15, 2025
HYD: గవర్నర్ అవార్డ్స్.. 2025 నామినేషన్లకు ఆహ్వానం

గవర్నర్ అవార్డ్స్–2025 కోసం నామినేషన్లను ఆహ్వానిస్తూ HYD రాజ్భవన్ ప్రకటించింది. 2020 నుంచి తమ తమ రంగాల్లో విశేష సేవలందించిన వ్యక్తులు, సంస్థలు, సంఘాలు, ట్రస్టులు ఈ అవార్డులకు అర్హులని తెలిపింది. మహిళా సాధికారత, గిరిజన అభివృద్ధి, రూరల్ హెల్త్ & మెడికల్ ఫీల్డ్, కార్పొరేట్ వాలంటీరింగ్ ముఖ్య విభాగాలు. నామినేషన్లు 5 డిసెంబర్ 2025 సా. 5 గంటల వరకు ఆన్లైన్ ద్వారా సమర్పించాలి.


