News March 31, 2025

ఏప్రిల్​ 6,7 తేదీల్లో భద్రాచలంలో మద్యం షాపులు బంద్

image

భద్రాద్రి రామాలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఏప్రిల్​ 6,7 తేదీల్లో భద్రాచలంలో మద్యం షాపులను మూసివేయాలని ఇప్పటికే కలెక్టర్​ఆదేశించారు. ఏప్రిల్​6న సీతారాముల కళ్యాణం, 7న పట్టాభిషేకం జరుగుతాయి. ఎండల నుంచి భక్తులకు ఉపశమనం కలిగించేలా ఫాగ్, 50 టన్నుల భారీ ఏసీ, వంద కూలర్లు, 250 ఫ్యాన్లను అమర్చుతున్నారు. 2 వేల మంది పోలీసులతో ఎస్పీ రోహిత్​రాజ్​, ఏఎస్పీ విక్రాంత్ ​కుమార్ సింగ్ భద్రతా ఏర్పాట్లు చేశారు.

Similar News

News November 24, 2025

HYD: రాహుల్ గాంధీ చేసిన అన్యాయాన్ని ఢిల్లీలో ఎండగడతాం: KTR

image

తెలంగాణ బీసీలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన అన్యాయని ఢిల్లీలో ఎండగడతామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి రిజర్వేషన్ల పెంపు జరగకముందే 42% బీసీలకు రిజర్వేషన్లు తెలంగాణలో ఇచ్చినట్టు రాహుల్ గాంధీ చెప్పుకుంటూ తిరుగుతున్నారని ఆరోపించారు. ఆయన చేస్తున్న మోసాన్ని దేశ ప్రజల ముందు ఉంచుతామని పేర్కొన్నారు.

News November 24, 2025

అన్న‌దాత‌ల సాధికార‌త‌కు రైత‌న్నా మీకోసం: కలెక్టర్

image

అన్నదాతల సాధికారతే లక్ష్యంగా ఈ రోజు నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. కలెక్టర్‌ కార్యాలయంలో పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. రాష్ట్ర ఆర్థిక సాధనకు మూలస్తంభమైన వ్యవసాయ రంగాన్ని పరిపుష్టి చేసేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తోందని వివరించారు.