News March 2, 2025

ఏయూతో కలిసి పని చేయడానికి ఐడీఎస్ సిద్ధం: గాలబ్

image

ఇనిస్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ స్టడీస్ ఆంధ్ర ప్రదేశ్ ప్రతినిధుల బృందం ఏయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య జి.పి రాజశేఖర్‌తో ఆదివారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. సంస్థ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్.గాలబ్ ఆచార్య రొక్కం రాధాకృష్ణ ప్రసంగాలు, పరిశోధనకు సంబంధించిన పుస్తకాన్ని బహుకరించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంతో కలసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. పరిశోధన, బోధనా రంగాల్లో తాము సేవలందిస్తామన్నారు.

Similar News

News March 15, 2025

విశాఖలో జూన్ 1నుంచి జరిమానా

image

సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు స్వస్తి పలుకుదామని ప్రిన్సిపల్ సెక్రటరీ, జిల్లా ప్రత్యేకాధికారి కాటమనేని భాస్కర్ అన్నారు. శనివారం విశాఖ ఆర్‌కె బీచ్ వద్ద స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్ర అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. జనవరి 1నుంచి ప్లాస్టిక్ వస్తువులు వాడొద్దని చెప్పినా అక్కడక్కడ కనిపిస్తూన్నాయన్నారు. జూన్ 1నుంచి సింగల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగదారులకు జరిమానాలు విధిస్తామని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు.

News March 15, 2025

గాజువాకలో బాలికపై అత్యాచారయత్నం..!

image

గాజువాకలో మైనర్‌పై అత్యాచారయత్నం కలకలం రేపింది. డ్రైవర్స్ కాలనీలో పదేళ్ల బాలికపై దాడి భాను ప్రకాష్ అనే వ్యక్తి అత్యాచారయత్నం చేశాడు. బాలిక తల్లిదండ్రులు పనికి వెళ్లిన సమయంలో మద్యం మత్తులో ఈ దారుణానికి ఒడిగడ్డాడు. తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన ఘటన గురించి చిన్నారి వారికి చెప్పింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో భాను ప్రకాష్‌ని గాజువాక పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

News March 15, 2025

ఒంటిపూట నిబంధన పాటించకుంటే చర్యలు: డీఈవో

image

విశాఖ జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు శనివారం నుంచి ఒంటిపూట బడులు నడపాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.ప్రేమ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఉదయం 07:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పాఠశాలలు నిర్వహించాలని సూచించారు. ఎండలు దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో ప్రతీ పాఠశాల తప్పక నిబంధనలు పాటించాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

error: Content is protected !!