News September 29, 2024
ఏయూ: ‘అక్టోబర్ 7 నుంచి దసరా సెలవులు’

ఏయూతో పాటు అనుబంధ కాలేజీలకు దసరా సెలవులు ప్రకటిస్తూ రిజిస్ట్రార్ ఈ.ఎన్ ధనుంజయ రావు ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్ 7 (సోమవారం) నుంచి 12(శనివారం) వరకు దసరా సెలవులు ఉంటాయని పేర్కొన్నారు. ఆదివారం కూడా సెలవు కావడంతో అక్టోబర్ 14(సోమవారం) తిరిగి తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు.
Similar News
News December 9, 2025
విశాఖ: రేపటి నుంచి 21 వరకు టెట్ పరీక్ష

డిసెంబర్ 10 నుంచి 21వ తేదీ వరకు జిల్లాలోని 12 కేంద్రాల్లో టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈఓ ప్రేమ్ కుమార్ మంగళవారం తెలిపారు. విశాఖ జిల్లాలో 11 కేంద్రాలు, అనకాపల్లి, మాకవరపాలెంలో ఒక కేంద్రం ఉందని పేర్కొన్నారు. మొత్తం 26,248 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు వివరించారు. ఉదయం 9.30 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు.
News December 9, 2025
విశాఖలో ఆయిల్ పామ్ సాగుకు 100% రాయితీ

విశాఖ జిల్లాలో 100 హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉద్యాన అధికారిణి శ్యామల తెలిపారు. రైతులకు 100% రాయితీపై మొక్కలు, అంతర పంటల నిర్వహణకు రూ.21,000 సాయం, డ్రిప్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇది 30 ఏళ్ల పాటు స్థిరమైన ఆదాయం ఇస్తుందని, భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాల రైతులు ఆర్బీకేల్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
News December 8, 2025
జీవీఎంసీలో అడ్డగోలు ప్రతిపాదనలు వెనక్కి..!

జీవీఎంసీలో అభివృద్ధి పనులపై 287 అంశాలకు గాను 34 అంశాలను స్థాయి సంఘం ఆమోదం తెలపకూండా శనివారం వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనలకు ఆమోదం విషయంలో కాంట్రాక్టర్లతో కుమ్మక్కు అయ్యారంటూ స్థాయి సంఘం సభ్యులపై వార్తలు రావడంతోనే వీటిని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. చర్చ సమయంలో కొందరు అధికారుల తప్పిదాలకు తాము విమర్శలు ఎదుర్కోవల్సి వస్తుందని స్థాయి సంఘం చైర్మన్ పీలా శ్రీనివాసు సైతం వ్యాఖ్యానించారు.


