News July 22, 2024

ఏయూ: ‘ఆగస్టు 27 నుంచి పరీక్షలు’

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని ఇంజనీరింగ్ బి.ఆర్క్, ఎంఎస్సీ అప్లైడ్ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ రెండో సెమిస్టర్ పరీక్ష ఫీజును ఆగస్టు 6వ తేదీలోగా చెల్లించాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ టి.చిట్టిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. రూ.2 వేలు అపరాధరుసుంతో ఆగస్టు 7 నుంచి 13 వరకు ఫీజును స్వీకరించనున్నట్లు వెల్లడించారు. ఆగస్టు 27 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఆగస్టు 14 తర్వాత ఫీజులు స్వీకరించమన్నారు.

Similar News

News November 9, 2025

ఏపీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మారుతుంది: మంత్రి కొండపల్లి

image

విశాఖలో ఏపీ గ్లోబల్ ఎంఎస్ఎంఈ ఎగుమతుల అభివృద్ధి సదస్సును ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదివారం ప్రారంభించారు. ఈ సదస్సుకు 16 దేశాల నుంచి 44 మంది డెలిగేట్‌లు హాజరయ్యారు. ఏపీని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మంత్రి పేర్కొన్నారు. MSMEలకు ఇప్పటికే రూ.439 కోట్ల మేర ప్రోత్సాహకాలను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు.

News November 9, 2025

విశాఖ సీపీ కార్యాలయంలో రేపు పీజీఆర్ఎస్‌ రద్దు

image

విశాఖ సీపీ కార్యాలయంలో రేపు జరగబోయే పీజీఆర్ఎస్‌ను రద్దు చేసినట్లు సీపీ శంక బ్రత బాగ్చి తెలిపారు. జిల్లా పోలీస్ యంత్రాంగం CII పార్ట్‌నర్ షిప్ సమ్మిట్ ఏర్పాట్లలలో, భద్రత చర్యలలో ఉన్నందున PGRSను తాత్కాలికంగా రద్దు చేసామన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని సీపీ కోరారు. అలాగే జీవీఎంసీలో కూడా రేపు పీజీఆర్ఎస్‌ రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.

News November 9, 2025

విశాఖ కలెక్టరేట్‌లో రేపు జరగబోయే PGRS రద్దు

image

విశాఖ కలెక్టరేట్‌లో రేపు జరగబోయే పీజీఆర్ఎస్‌ను రద్దు చేసినట్లు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. జిల్లా అధికార యంత్రాంగం CII పార్ట్‌నర్ షిప్ సమ్మిట్ ఏర్పాట్లలో ఉన్నందున PGRSను తాత్కాలికంగా రద్దు చేశామన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని కలెక్టర్ కోరారు. నవంబర్ 17వ తేదీన PGRS యథావిధిగా నిర్వహిస్తామని చెప్పారు.