News August 6, 2024

ఏయూ: ఆన్‌లైన్ క్విజ్.. ప్రైజ్‌మనీ రూ.40వేలు

image

ఏయూ అంబేడ్కర్ ఛైర్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రీడమ్ క్విజ్ నిర్వహిస్తున్నట్లు ఆచార్య ఎం.జేమ్స్ స్టీఫెన్ తెలిపారు. ఆన్‌లైన్ క్విజ్ 12న, రాత పరీక్ష 13న, ఫైనల్ పోటీలు 14న నిర్వహిస్తారు. ప్రథమ బహుమతిగా రూ.25 వేలు, 2వ బహుమతిగా రూ.10వేలు, 3వ బహుమతిగా రూ.5వేల నగదుతో పాటు ట్రోఫీ ఇస్తారు. ఆసక్తి గల వారు ఈనెల 10వ తేదీలోగా 97000 66832 నంబరును సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

Similar News

News February 27, 2026

విజయనగరం: సైకో కిల్లర్ ఉపేంద్ర బాబు హత్య

image

అనకాపల్లి(D) మాడుగుల(M) జంపినకు చెందిన సీరియల్ సైకో కిల్లర్ పెచ్చేటి ఉపేంద్ర బాబును గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఉపేంద్ర బాబు ఐదు మర్డర్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఇటీవల విజయనగరం జిల్లాలో చేసిన దొంగతనం కేసులో జైలుకు వెళ్లి, బెయిల్ మీద బయటకు వచ్చాడు. కాగా మారణాయుధాలతో ఉపేంద్ర బాబును హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం. ఘటనకు సంబంధించి మరిన్నివివరాలు తెలియాల్సి ఉంది.

News February 27, 2026

VZM: జిల్లాలో 122 కొత్త పోలింగ్ స్టేషన్లకు ప్రతిపాదనలు

image

ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా రెవెన్యూ అధికారి మురళి కోరారు. గురువారం అయన ఛాంబర్‌లో పొలిటికల్ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. విజయనగరం జిల్లాలో మొత్తం 15,76,018 మంది ఓటర్లు ఉన్నారు. ప్రస్తుతం 1,847 పోలింగ్ స్టేషన్లు ఉండగా.. కొత్తగా 122 స్టేషన్లకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. గుర్తింపు పొందిన పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకోవాలన్నారు.