News August 1, 2024

ఏయూ: ఈనెల 21 నుంచి ఎంబీఏ పరీక్షలు ప్రారంభం

image

ఏయూ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ (ఏయూ సిబ్) లో ఎంబీఏ నాలుగో సెమిస్టర్ పరీక్షలను ఆగస్టు 21 నుంచి 28వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ జె.రత్నం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. సబ్జెక్టుల వారీగా పరీక్షల తేదీలను ఏయూ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు ఆమె తెలిపారు.

Similar News

News January 18, 2026

విశాఖలో ప్రముఖ వైద్యుడి మృతి

image

వేలాది పోలియో, వికలాంగ బాధితులకు జీవితాల్లో వెలుగులు నింపిన ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆదినారాయణరావు(85) శనివారం విశాఖపట్నంలో కన్నుమూశారు. ప్రేమ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడిగా 4 దశాబ్దాలకు పైగా సేవలందించిన ఆయన సుమారు 3లక్షల శస్త్ర చికిత్సలు చేశారు. పోలియో బాధితులకు చేసిన సేవలకుగాను 2022లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ఆయన మృతికి వైద్య, ప్రజావర్గాలు సంతాపం వ్యక్తం చేశాయి.

News January 17, 2026

విశాఖకు రానున్న రాహుల్ గాంధీ.. ఎప్పుడంటే?

image

పార్లమెంటరీ రక్షణ కమిటీ చైర్మన్ రాధా మోహన్ సింగ్ నేతృత్వంలో ఎంపీల బృందం జనవరి 19 నుంచి మూడు రోజుల పాటు విశాఖలో పర్యటించనుంది. ఈ బృందంలో రాహుల్ గాంధీ, మహువా మోయిత్రా తదితరులు ఉన్నారు. వీరు ఎన్‌ఎస్‌టీఎల్ (NSTL)లో డీఆర్డీఓ ప్రాజెక్టులను, కోస్ట్ గార్డ్ తీరప్రాంత భద్రతను సమీక్షించనున్నారు. వీవీఐపీల రాక నేపథ్యంలో నగరం అంతటా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

News January 17, 2026

విశాఖలో రెండు ట్రావెల్ బస్సులు సీజ్

image

సంక్రాంతి పండుగల నేపథ్యంలో ఉప రవాణా కమిషనర్ ఆర్సీహెచ్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు శనివారం విశాఖలో మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌లు, రవాణా శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిబంధనలు పాటించని 2 ట్రావెల్ బస్సులను సీజ్ చేసి, నిబంధనలు ఉల్లంఘించిన మరో 5 బస్సులపై కేసుల నమోదు చేసి రూ.60,000 జరిమానాలు విధించారు. నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.