News November 15, 2024

ఏయూ: ఎం.ఫార్మసీ రెండో సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో ఎం.ఫార్మసీ రెండో సెమిస్టర్ రెగ్యులర్, సప్లమెంటరీ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షలు భాగం అధికారులు తెలిపారు. అక్టోబర్ నెలలో నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలను కొద్దిసేపటి క్రితం విడుదల చేసి ఏయూ వెబ్ సైట్‌లో ఉంచారు. విద్యార్థులు రీవాల్యుయేషన్ కోసం ఈనెల 28వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Similar News

News December 5, 2024

పుష్ప-2పై విశాఖ జనసేన నేత ట్వీట్

image

పుష్ప-2 హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో విశాఖ జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ స్పందించారు. ‘ప్రపంచ వ్యాప్తంగా కొత్త రికార్డులు సృష్టిస్తోన్న పుష్ప-2 బెనిఫిట్ షోలు వేసుకొనడానికి అనుమతిచ్చిన ప్రభుత్వాలు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన, చేస్తున్న కృషి.. తెలుగు సినిమా పరిశ్రమ ఆర్థికంగా తన స్థాయిని పెంచడానికి దోహదపడుతుంది. YCP ప్రభుత్వం ఉంటే నిర్మాతలతో పాటు రాష్ట్ర ఖజానాకు గండి పడేది’ అని ట్వీట్ చేశారు.

News December 5, 2024

సింహాచలంలో ఆధ్యాత్మిక మ్యూజియం

image

సింహాచలం పుణ్యక్షేత్రంపై ఆధ్యాత్మిక మ్యూజియం నిర్మించాలని సంకల్పించామని బ్రహ్మకుమారీస్ వికే రమాదేవి తెలిపారు. ఈ మేరకు ఆమె డాబాగార్డెన్స్ వీజేఎఫ్ ప్రెస్ క్లబ్‌లో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మ్యూజియంను సనాతన ధర్మాన్ని ప్రతిబింబించే విధంగా దేవతల విగ్రహాలతో పాటు, సామాజిక, నైతిక విలువలు తెలియజేసే విధంగా నిర్మిస్తామని అన్నారు.

News December 5, 2024

విశాఖ: రేషన్ బియ్యంపై ఆరోపణల నేపథ్యంలో మంత్రి సమీక్ష

image

ఉత్తరాంధ్ర జిల్లాల జాయింట్ కలెక్టర్లు, సివిల్ సప్లైస్, లీగల్ మెట్రాలజీ, వ్యవసాయ శాఖ అధికారులతో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు, వినియోగదారుల వ్యవహారాలు తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. అధికారులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.