News July 26, 2024
ఏయూ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ రాజీనామా

ఆంధ్ర యూనివర్సిటీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న విశ్రాంత పోలీసు ఉన్నతాధికారి మహమ్మద్ ఖాన్ తన పదవికి రాజీనామా చేశారు. గత కొన్ని నెలలుగా ఆయన విధులకు దూరంగా ఉంటున్నారు. గురువారం సాయంత్రం ఏయూ రిజిస్టార్ కు తన రాజీనామా లేఖ అందించి ఆయన వెళ్లిపోయినట్లు ఏయూ వర్గాలు తెలిపాయి. మూడు సంవత్సరాల క్రితం నియమితులైన ఆయన ఏయూ భద్రత పటిష్ఠం చేయడంతో పాటు పలు వివాదాలకు కూడా కేంద్రంగా మారారు.
Similar News
News October 22, 2025
గంటా శ్రీనివాస్ జోక్యంతో ఫుట్ ఓవర్ బ్రిడ్జికి గ్రీన్ సిగ్నల్

చంద్రంపాలెం ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి మెట్రో ఆమోదం తెలిపింది. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చొరవతో మెట్రో ఎండీ రామకృష్ణారెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రూ.3.23 కోట్లతో నిర్మించే ఈ బ్రిడ్జి నిర్మాణంపై మెట్రో అధికారులు అభ్యంతరం చెప్పారు. దీంతో గంటా సమస్యను వివరించి మెట్రో డిజైన్‌ను బ్రిడ్జి కంటే ఎత్తులో ఖరారు చేయించారు.
News October 21, 2025
పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచండి: మేయర్

అంతర్జాతీయ కార్యక్రమాలకు విశాఖను సుందరీకరించండని మేయర్ పీలా శ్రీనివాసరావు జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. కార్మికుల హాజరును పరిశీలించి, వారి వేతనాలను సకాలంలో చెల్లించాలన్నారు. బీచ్ రోడ్డులో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి ఎక్కువ మంది కార్మికులను నియమించాలని, గైర్హాజరైన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. బీచ్‌లో అదనంగా టాయిలెట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.
News October 21, 2025
వ్యాపారులు డస్ట్ బిన్లు ఉపయోగించాలి: జీవీఎంసీ కమిషనర్

వ్యాపారులు దుకాణాల ముందు డస్ట్ బిన్లు ఉపయోగించాలని, లేనియెడల వారి లైసెన్సులు రద్దు చేస్తామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ హెచ్చరించారు. మంగళవారం ఆరిలోవలో పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. మాంసం, పూల వ్యాపారులు వ్యర్థాలను రోడ్లపై వేయడంతో వారిచేత క్లీన్ చేయించారు. టిఫిన్ సెంటర్ వద్ద డస్ట్ బిన్ లేకపోవడంతో రూ.1000 అపరాధ రుసుమును వసూలు చేయాలని శానిటరీ ఇన్స్పెక్టర్ను ఆదేశించారు.