News July 26, 2024
ఏయూ డిస్టెన్స్ ఎడ్యుకేషనలో కొత్త కోర్సులు

ఆంధ్ర విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం నుంచి ఈ సంవత్సరం బీఈడి, ఎంబీఏ హాస్పిటల్ మేనేజ్మెంట్, బీకాం కంప్యూటర్ సైన్స్, బిబిఏ, ఎం.ఎస్సీ జియో ఇన్ఫర్మేటిక్స్ ప్రారంభిస్తున్నట్లు ఇన్ ఛార్జ్ వీసీ ఆచార్య జి.శశిభూషణరావు తెలిపారు. దూరవిద్యలో 75 వేలకు పైగా విద్యార్థులు చదువుతున్నారని వీరి సంఖ్యను లక్షకు చేర్చడం లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. డిమాండ్ ఉన్న కోర్సులకు ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.
Similar News
News November 5, 2025
రాష్ట్ర భవిష్యత్తుకే తలమానికం: మంత్రి డోలా

విశాఖ వేదికగా జరగనున్న భాగస్వామ్య సదస్సు రాష్ట్ర భవిష్యత్తుకు తలమానికం కానుందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పేర్కొనారు. AU ఇంజినీరింగ్ గ్రౌండ్లో ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. 40 పైచిలుకు దేశాల నుంచి వందల సంఖ్యలో వివిధ కంపెనీల ప్రతినిధులు వస్తున్నారని తెలిపారు. దీంతో రాష్ట్రానికి రూ.9.8 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల ఉద్యోగావకాలు వస్తాయన్నారు.
News November 5, 2025
విశాఖ: శ్మశానం వద్ద ఉరి వేసుకుని యువకుడి మృతి

మధురవాడలోని చంద్రంపాలెం గ్రామంలో శ్మశానం వద్ద ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉరి వేసుకొని ఉన్న యువకుడి మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో పీఎంపాలెం పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడు గేదెల ఫణి (18)గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News November 5, 2025
విశాఖ: అంగన్వాడీ ఉద్యోగాలు.. 2 పోస్టులకు 22మంది

ఐసీడీఎస్ విశాఖ అర్బన్ పరిధిలో అంగన్వాడి వర్కర్, హెల్పర్ పోస్టులకు మంగళవారం ధ్రువపత్రాల పరిశీలన చేపట్టారు. 2 అంగన్వాడీ వర్కర్ పోస్టులకు 22 మంది, 21 హెల్పర్ పోస్టులకు 89 మంది దరఖాస్తు చేసుకున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు చేయాల్సిన దరఖాస్తు పరిశీలన 12 గంటలకు చేపట్టారు. చివరిరోజు కావడంతో ఎక్కువమంది ఒకేసారి చేరుకున్నారు. దీంతో కాస్త ఇబ్బందికర పరిస్థితి నెలకొంది.


