News July 3, 2024

ఏయూ పరిధిలో గురువారం జరగాల్సిన పరీక్షలు వాయిదా: టీ. చిట్టిబాబు

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో ఈ నెల 4వ తేదీన జరగాల్సిన రెండో, నాల్గో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ డిగ్రీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ టీ. చిట్టిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ విద్యార్థి సంఘాలు 4వ తేదీన బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేసినట్లు తెలిపారు. గురువారం జరగాల్సిన పరీక్షలు మరలా ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామని చెప్పారు.

Similar News

News October 13, 2024

పైడితల్లి అమ్మవారి జాతరకు పటిష్ఠ ఏర్పాట్లు: విద్యుత్ శాఖ

image

జిల్లా కేంద్రం విజయనగరం పైడితల్లి అమ్మవారి జాతర మహోత్సవం, సిరిమాను ఉత్సవాల సందర్భంగా ఎటువంటి విద్యుత్ అంతరాయం కలగకుండా పటిష్ఠ ఏర్పాట్లు చేశామని విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ మువ్వల లక్ష్మణరావు తెలిపారు. ముఖ్యమైన ప్రదేశాల్లో సిబ్బందికి బాధ్యతలు అప్పగించామని, విద్యుత్ సమస్యలకు 94408 12449, 55, 65, 66 నంబర్లకు గానీ, 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు గాని తెలియజేయాలని కోరారు.

News October 13, 2024

విజయనగరం చరిత్ర భవిష్య తరాలకు తెలియాలి : మంత్రి

image

మన సంస్కృతి, చరిత్ర, సాంస్కృతిక వైభవాన్ని నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం ఉత్సవాల్లో భాగంగా, శ్రీ పైడితల్లి అమ్మవారి చరిత్ర, విజయనగరం గొప్పదనాన్ని వివరిస్తూ రూపొందించిన లేజర్ షోను కోట వద్ద మంత్రి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. విజయనగరం గొప్ప చారిత్రక సంపదకు ఘనమైన చరిత్రకు నిలయమని పేర్కొన్నారు. ఈ చరిత్రను నేటి తరానికి తెలియజేయాలన్నారు.

News October 13, 2024

విజయనగరం జిల్లాలో స్పీకర్ పర్యటన

image

ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు విజయనగరంలో ఆదివారం పర్యటించనున్నారు. స్థానిక అయోధ్య మైదానంలో ఉదయం 11 గంటలకు విజయనగరం ఉత్సవాలను స్పీకర్ ఘనంగా ప్రారంభించనున్నారని కమిటీ నిర్వాహుకులు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీపైడితల్లి ఆలయం నుంచి అయోధ్య మైదానం వరకు ఉత్సవాల ప్రారంభోత్సవ ర్యాలీ జరుగుతుందని చెప్పారు.