News January 8, 2025
ఏయూ పరిధిలో పరీక్షలు వాయిదా

ఆంధ్ర విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాల పరిధిలో నేడు జరగాల్సిన యూజీ, పీజీ పరీక్షలను వాయిదా వేసినట్లు రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్ ధనంజయరావు పేర్కొన్నారు. నగరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ జరగాల్సిన పరీక్షలను మళ్లీ ఎప్పుడు నిర్వహించేది త్వరలో తెలియజేస్తామని తెలిపారు.
Similar News
News December 10, 2025
విశాఖలో టెట్ పరీక్షకు తొలిరోజు 91.05% హాజరు

విశాఖలో బుధవారం జరిగిన టెట్ పరీక్షకు మొత్తం 2001 మంది అభ్యర్థులకు గానూ 1822 మంది (91.05%) హాజరయ్యారు. పరీక్షల సరళిని డీఈవో స్వయంగా 2 కేంద్రాల్లో తనిఖీ చేయగా.. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం 5 కేంద్రాలను సందర్శించి పరిశీలించింది. ఉదయం 5 కేంద్రాల్లో, మధ్యాహ్నం ఒక కేంద్రంలో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని డీఈవో ప్రేమ్ కుమార్ తెలిపారు.
News December 10, 2025
ఎండాడ జాతీయ రహదారిపై బస్సు ఢీకొని జింక మృతి

ఎండాడ జాతీయ రహదారిపై బస్సు ఢీకొని జింక మృతి చెందింది. కంబాలకొండ నుంచి జింకలు తరచుగా రోడ్డుపైకి వస్తుంటాయి. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం జింక రోడ్డుపైకి ఆకస్మికంగా రావడంతో, అటుగా వస్తున్న బస్సు ఢీకొంది. జింక అక్కడికక్కడే మృతి చెందింది. కంబాలకొండ అడవి నుంచి ఇలా రోడ్డెక్కిన జింకలు తరచుగా ప్రమాదాలకు గురై, తీవ్ర గాయాలు లేదా మరణం సంభవిస్తున్నాయి. మృతదేహాన్ని అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
News December 10, 2025
విశాఖలో నేటి నుంచి ఎక్కడికక్కడ పనులు బంద్

జీవీఎంసీ పరిధిలో కాంట్రాక్టర్లు బుధవారం నుంచి పనులు నిలిపివేయడానికి నిర్ణయం తీసుకున్నారు.18 నెలలు నుంచి కాంట్రాక్టర్లకు రూ.400 కోట్ల బకాయిలు ఉండగా బిల్లులు చెల్లించాలని పలు దఫాలుగా వినతులు ఇచ్చారు. మంగళవారం కమిషనర్కు నోటీసులు కూడా అందజేశారు. స్పందించకపోవడంతో నేటి నుంచి యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాల్లోనూ కాంట్రాక్టర్లు పనులు నిలిపివేసేలా చర్యలు తీసుకున్నారు.


