News November 3, 2024
ఏయూ పరిధిలో యూజీ రీ వాల్యుయేషన్ ఫలితాల విడుదల
ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని యూజీ డిగ్రీ మొదటి సెమిస్టర్, రెండో సెమిస్టర్, మూడో సెమిస్టర్, 4వ సెమిస్టర్, 5వ సెమిస్టర్, 6వ సెమిస్టర్ రీ వాల్యుయేషన్ ఫలితాలు విడుదల చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు పరీక్షల విభాగం అధికారులు పేర్కొన్నారు. జూన్ నెలలో జరిగిన ఈ పరీక్షలకు రీ వాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసిన విద్యార్థులు తమ మార్కుల వివరాలను AU వెబ్‌సైట్ నుంచి పొందవచ్చు అన్నారు.
Similar News
News December 2, 2024
విశాఖలో 9 స్పెషల్ ఎకనామిక్ జోన్లు ఏర్పాటు..!
ఏపీలో జిల్లాల వారీగా మొత్తం 34 స్పెషల్ ఎకనామిక్ జోన్లు ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిలో ఉమ్మడి విశాఖ జిల్లాలో 9 ఆర్థిక మండలాలు ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో పరవాడ మండలం ఈ.బోనంగి, విశాఖ గ్రామీణ ప్రాంతం మధురవాడ, రేసపువానిపాలెం, నక్కపల్లి మండలం, అచ్యుతాపురం, రాంబిల్లి మండలాలు, జి.కోడూరు ప్రాంతాలు ఉన్నాయి.
News December 2, 2024
సెలబ్రిటీలను మోసం చేసిన విశాఖ యువకుడు
సెలబ్రిటీలను మోసం చేసిన కేసులో విశాఖకు చెందిన తొనంగి కాంతిదత్(24)ను చంచల్ గూడ జైలుకు పోలీసులు తరలించారు. 10th ఫెయిలైన అతను ఈవెంట్స్ సంస్థను నెలకొల్పి సెలబ్రెటీలతో పరిచయాలు పెంచుకున్నాడు. అనంతరం తన వ్యాపారాల్లో సెలబ్రెటీలు పెట్టుబడులు పెడుతున్నారని నమ్మించి పలువురి వద్ద కోట్ల రూపాయలు వసూలు చేశాడు. జ్యూవెలర్స్‌లో పెట్టుబడుల పేరుతో తనను మోసం చేశాడని శ్రీజారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కటకటాలపాలయ్యాడు.
News December 2, 2024
విశాఖలో తందూరీ టీ చేసిన హోంమంత్రి
హోంమంత్రి వంగలపూడి అనిత ఎంవీపీ కాలనీలో ఆదివారం ‘టీ’ కాచారు. ఓ టీ స్టాల్ వద్ద షాప్ వద్ద పలువురితో సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా కంచు పాత్రలో చిన్న కుండలో ప్రత్యేకంగా చేసే ‘టీ’ తయారీ విధానాన్ని పరిశీలించారు. అనంతరం హోంమంత్రి అనిత స్వయంగా ‘తందూరీ టీ’ని తయారు చేసి తాగారు.