News November 14, 2024
ఏయూ: రెండో సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల
ఎంటెక్, ఎంప్లానింగ్ రెండో సెమిస్టర్ రెగ్యులర్, సప్లమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసి వెబ్ సైట్‌లో పొందుపరిచినట్లు పరీక్షలు విభాగం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ నెలలో జరిగిన ఈ పరీక్షల ఫలితాలను గురువారం విడుదల చేశారు. విద్యార్థులు ఏయూ వెబ్ సైట్ నుంచి తమ రిజిస్ట్రేషన్ (హాల్ టికెట్) నెంబర్ ఉపయోగించి పరీక్షా ఫలితాలను పొందవచ్చును.
Similar News
News December 7, 2024
నాలెడ్జ్ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం
సాంకేతికత అభివృద్ధికి దోహద పడుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలో శుక్రవారం నేషనల్ కాంక్లేవ్ ఆన్ డీప్ టెక్ ఇన్నోవేషన్‌లో సీఎం పాల్గొన్నారు.1996లో ఐటీ గురించి మాట్లాడిన తను ఇప్పుడు డీప్ టెక్ గురించి మాట్లాడటం సంతోషంగా ఉందన్నారు. ఐటీ రంగంపై ఎలాంటి అంచనాలు లేకపోయినప్పటికీ ముందుచూపు వల్లే ఆ రంగంలో మేటిగా నిలిచామన్నారు. ఇకపై ప్రతి 3 నెలలకొకసారి డీప్ టెక్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తామన్నారు.
News December 7, 2024
విశాఖ: డీప్ టెక్ సదస్సులో ఏడు ఒప్పందాలు
విశాఖ వేదికగా శుక్రవారం జరిగిన డీప్ టెక్ సదస్సులో GFST(గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్‌ఫర్‌మేషన్)కు వివిధ కంపెనీల మధ్య ఏడు ఒప్పందాలు జరిగాయి. విద్య, వైద్య రంగాల్లో టెక్నాలజీ, అడ్వాన్స్‌డ్ స్టడీస్, మహిళా సాధికారత తదితర అంశాలపై GFSTతో సమగ్ర, జీఎస్‌ఆర్, ఫ్లూయింట్ గ్రిడ్ లిమిటెడ్, జర్మన్ వర్శిటీ ఒప్పందాలు చేసుకోగా, గేమ్ కంపెనీ రెండు ఎంవోయూలు చేసుకుంది.
News December 6, 2024
విశాఖ: డ్రగ్స్ కాదు.. డ్రై ఈస్ట్
ఈ ఏడాది మార్చిలో ఎన్నికల వేళ విశాఖ పోర్టుకి బ్రెజిల్ నుంచి 25 వేల టన్నుల డ్రగ్స్ వచ్చిందన్న వార్త సంచలనమైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రంగంలోకి దిగిన సీబీఐ తాజాగా విచారణను ముగించింది. బ్రెజిల్ నుంచి వచ్చిన కంటైనర్‌లో డ్రగ్స్ లేదని కేవలం డ్రై ఈస్ట్ ఉన్నట్లు కోర్టుకు నివేదిక సమర్పించింది. దీంతో సీజ్ చేసిన షిప్‌ను విడుదల చేసినట్లు కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్.శ్రీధర్ తెలిపారు.