News February 18, 2025
ఏయూ వైస్ ఛాన్సలర్‌గా పీజీ రాజశేఖర్ నియామకం

విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌గా ఖరగ్‌పూర్ ఐఐటీకి చెందిన పీజీ రాజశేఖర్‌ను నియమిస్తూ మంగళవారం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఖరగ్‌పూర్ ఐఐటీలో గణిత శాస్త్ర ప్రొఫెసర్‌గా పని చేస్తున్న పీజీ రాజశేఖర్‌ను వైస్ ఛాన్సలర్‌గా నియమించడంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News March 19, 2025
విశాఖలో కానరాని చలివేంద్రాలు..!

విశాఖనగరంలో ఎండలు పెరుగుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో ప్రజలు బయటకు రావాలంటే ఎక్కడ వడదెబ్బ తగులుతుందని భయపడుతున్నారు. మనిషి నిరసించి పడిపోతే వెంటనే నీరు అవసరం. గతంలో జీవీఎంసీ సహా పలు స్వచ్ఛందసంస్థలు ప్రతివార్డులో చలివేంద్రాల్లో మంచినీరు, మజ్జిగ ఏర్పాటు చేసేవి. ఇప్పుడు ఆరిలోవ నుంచి మద్దిలపాలెం వరకు ఎక్కడ చుసిన ఒక్క చలివేంద్రం అందుబాటులో లేకపోవడంతో ప్రజలు పెదవి విరుస్తున్నారు.
News March 19, 2025
జీవీఎంసీ బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేయండి: మేయర్

జీవీఎంసీ బడ్జెట్ సమావేశం వెంటనే ఏర్పాటు చేయాలని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్‌ను కోరినట్లు విశాఖ మేయర్ గొలగాని హరివెంకట కుమారి బుధవారం తెలిపారు. 2025 – 26 ఆర్థిక సంవత్సరం సంబంధించి ప్రత్యేక బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి అందజేశామన్నారు. అయితే అసెంబ్లీ మార్చి 22, 29 తేదీల్లో శాసనసభకు, పార్లమెంటుకు సెలవు ఉంటుందని ఆరోజు బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు.
News March 19, 2025
విశాఖ: చిన్న శ్రీను కుమారుడి మృతి

విజయనగరం జిల్లా పరిషత్ ఛైర్మన్, భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు రెండో కుమారుడు ప్రణీత్ నేడు మృతి చెందాడు. 2020లో ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రణీత్ 4 సంవత్సరాల 10 నెలల పాటు మృత్యువుతో పోరాడాడు. చివరకు విశాఖలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచారు.