News February 18, 2025
ఏయూ వైస్ ఛాన్స్‌లర్‌కి విశాఖతో అనుబంధమిదే..!

ఏయూ వైస్-చాన్సలర్‌గా మంగళవారం నియామకం అయిన రాజశేఖర్ విశాఖలో విద్యాభ్యాసం చేశారు. విశాఖలో సెయింట్ ఆంథోనీస్ హైస్కూల్‌లో పదోతరగతి పూర్తి చేశారు. ఏ.వి.ఎన్. కళాశాలలో ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయనను ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా నియమించారు. అయితే విశాఖతో అనుబంధం ఉన్న వ్యక్తిని వైస్ ఛాన్సలర్‌గా నియమించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News March 17, 2025
VZM: ఆరుగురిపై కేసు నమోదు

ఖాళీ ప్రదేశాల్లో మద్యం తాగుతూ ప్రజాశాంతికి భంగం కలిగించే వారిపై విజయనగరం జిల్లా పోలీసులు దృష్టి సారించారు. నిర్మానుష్య ప్రాంతాల్లో నిఘా పెట్టి వారిని పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారు. ఆదివారం సంతకవిటి మండలం గుళ్ల సీతారాంపురం శివారులో బహిరంగంగా మద్యం తాగుతున్న వారిపై రాజాం పోలీసులు దాడులు చేశారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న ఆరుగురు మందుబాబులపై కేసు నమోదు చేశారు.
News March 17, 2025
నాలుగు పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు: DEO

జిల్లాలో రేపటి నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు చేసినట్లు DEO మాణిక్యం నాయుడు, రాష్ట్ర పరిశీలకుడిగా జిల్లాకు వచ్చిన విద్యాశాఖ అధికారి టెహరా సుల్తానా చెప్పారు. ఆదివారం విజయనగరం కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాలుగు కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా సీసీ టీవి కెమెరాలను అమర్చామన్నారు. 9 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేశామన్నారు.
News March 16, 2025
VZM: అక్రమంగా ఆస్తులు సంపాదిస్తే అటాచ్ చేస్తాం: SP

గంజాయి ద్వారా అక్రమంగా ఆస్తులు సంపాదిస్తే అటాచ్ చేస్తామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. గంజాయి విక్రయాలు, అక్రమ రవాణా చేపట్టినా, వినియోగించినా నేరమేనన్నారు. గత సంవత్సరంలో అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై 62 కేసులు నమోదు చేశామన్నారు. జిల్లాలో 1656.990 లక్షల కిలోల గంజాయి, 70 గ్రాముల నల్లమందు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 25 కేసులు నమోదు చేశామన్నారు.