News July 16, 2024

ఏయూ: సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని బ్యాచిలర్ ఆఫ్ ఫైనార్ట్స్ 2వ సెమిస్టర్, 6వ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ ఫలితాలు, ఎంఎస్సీ మెరైన్ బయోటెక్నాలజీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షలు విభాగం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష ఫలితాలను ఏయూ వెబ్‌సైట్‌లొ పొందుపరిచామని, విద్యార్థులు తమ రిజిస్టర్ నంబర్‌ను నమోదు చేసి ఫలితాలను పొందవచ్చని తెలిపారు.

Similar News

News October 5, 2024

బుచ్చియ్యపేట: కరెంట్ షాక్.. బాలుడు మృతి

image

విద్యుత్ షాక్‌కు గురై బాలుడు మృతిచెందిన ఘటన బుచ్చియ్యపేట మండలంలోని పి.భీమవరంలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన వేపాడ అప్పారావు కుమారుడు భువన్ శంకర్ శనివారం పొలంలోకి వెళ్లాడు. అక్కడ గెడ్డ దాటుతుండగా అప్పటికే నేలపై తెగిపడి ఉన్న విద్యుత్ వైర్లు తగలడంతో షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం చోడవరం ఆసుపత్రికి  తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

News October 5, 2024

విశాఖ: ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే బాలిక మృతి

image

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పుంగనూరులో అదృశ్యమైన బాలిక మృతిచెందిందని ఎమ్మెల్సీ, వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ఆరోపించారు. పోలీసులు సరైన రీతిలో స్పందించి ఉంటే తల్లిదండ్రులకు కడుపుకోత ఉండేది కాదన్నారు. విశాఖలో ఆమె మాట్లాడుతూ.. కాలిన కాగితాలకున్న విలువ ఆడబిడ్డల ప్రాణాలకు లేదని విమర్శించారు. బాలిక మృతి సంఘటనను దర్యాప్తు లేకుండానే నీరు గార్చాలని పోలీసులు చూస్తున్నట్లు తెలిపారు.

News October 5, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యల పరిష్కారానికి చర్యలు

image

విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి శ్రీనివాస వర్మ అన్నారు. విజయవాడ BLP రాష్ట్ర కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కార్మికులు భద్రత కోసం ఆందోళన చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే వారికి హాని తలపెట్టమని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు.