News July 3, 2024

ఏయూ: 15 నుంచి బీఈడీ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని బీఈడీ 4వ సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షలను ఈనెల 15 నుంచి 25వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు పరీక్షలు భాగం డిప్యూటీ రిజిస్టార్ జె.రత్నం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాక్టికల్స్ నిర్వహణకు సంబంధించిన సమాచారాన్ని ఛైర్మన్ బోర్డ్ ఆఫ్ స్టడీస్‌కు తెలియజేయాలని పేర్కొన్నారు. సబ్జెక్ట్ ఎగ్జామినర్, ప్రిన్సిపల్స్ పర్యవేక్షణలో ప్రాక్టికల్స్ నిర్వహణ చేయాలని ఉత్తర్వుల్లో తెలిపారు.

Similar News

News December 2, 2025

విశాఖలో చేనేత వస్త్రాలు, హస్త కళల ప్రదర్శన ప్రారంభం

image

విశాఖలో ఆంధ్రప్రదేశ్ క్రాఫ్ట్స్ కౌన్సిల్ సాంప్రదాయ, చేనేత వస్త్రాలను, హస్త కళల ప్రదర్శనను ఏర్పాటు చేసింది. హోటల్ గ్రీన్ పార్క్‌లో సోమవారం ఈ ప్రదర్శనను CMR అధినేత మావూరి వెంకటరమణ, కంకటాల అధినేత మల్లిక్ కంకటాల, చందు తిప్పల ప్రారంభించారు. కార్యక్రమంలో క్రాఫ్ట్స్ కౌన్సిల్ బుక్‌లెట్‌ను విడుదల చేశారు. ప్రదర్శనలో కొల్హాపురి పాదరక్షలు, కలంకారి హ్యాండ్ పెయింటింగ్ లైవ్ క్రాఫ్ట్ డెమో అందరినీ ఆకట్టుకున్నాయి.

News December 2, 2025

విశాఖలో రెండు రోజులు ఆధునిక హస్తకళల ప్రదర్శన

image

విశాఖలో 2 రోజులు ఆధునిక హస్తకళల ప్రదర్శనను క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్ర‌ప్రదేశ్ వారు నిర్వహిస్తున్నారు. హోటల్ గ్రీన్ పార్క్‌లో డిసెంబర్ 1, 2వ తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ప్రదర్శన జరుగుతోంది. దేశం నలుమూలల నుంచి వివిధ రకాల ఆధునిక నేత వస్త్రాలు, చేనేత హస్తకళల ఉత్పత్తులు ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. భారతీయ కళాకారులు, నేతదారుల ప్రతిభను ప్రోత్సహించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టారు.

News December 2, 2025

మహిళ ఫొటోలు మార్ఫింగ్ చేసిన వ్యక్తి అరెస్ట్: విశాఖ సీపీ

image

తన వాట్సాప్ స్టేటస్ ఫొటోలను డౌన్లోడ్ చేసి వాటిని మార్ఫింగ్ చేసి (నగ్నంగా ఉండేటట్లు చిత్రీకరించి) సోషల్ మీడియాలో పెట్టినట్టు ఓ మహిళ విశాఖ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీపీ శంఖబ్రత బాగ్చీ ఆదేశాలతో సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేసి కాకినాడకు చెందిన తాటికాయల దివాకర మారుతి సత్యతేజ్‌‌ను నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశామన్నారు. సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు.